మాధవన్, దుల్కర్ సల్మాన్‌తో మల్టీస్టారర్ | Multi-starrer movie with Madhavan Dulquer Salmaan | Sakshi
Sakshi News home page

మాధవన్, దుల్కర్ సల్మాన్‌తో మల్టీస్టారర్

Published Wed, May 18 2016 1:50 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

మాధవన్, దుల్కర్ సల్మాన్‌తో మల్టీస్టారర్

మాధవన్, దుల్కర్ సల్మాన్‌తో మల్టీస్టారర్

 ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. నటుడు మాధవన్, దుల్కర్‌సల్మాన్‌లతో సీనియర్ నటుడు, దర్శకుడు ప్రతాప్‌పోతన్ ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నదే ఆ వార్త. తమిళంలో పలు హిట్ చిత్రాలలో నటించిన నటుడు మాధవన్. ఆపై బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించారు. ఈయన చిన్న గ్యాప్ తరువాత ఇరుదుచుట్రు చిత్రంతో మళ్లీ కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. ఇక మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్‌సల్మాన్. ఓ కాదల్‌కణ్మణి చిత్రం ద్వారా లవర్‌బాయ్‌గా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈయన రెండవ సారి మణిరత్నం చిత్రంలో నటించడానికి నిరాకరించి ఫ్రీ ప్రచారం చాలానే పొందారన్నది గమనార్హం.
 
 తాజాగా మాధవన్, దుల్కర్‌సల్మాన్‌లు ప్రతాప్‌పోతన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. 1990 ప్రాంతంలో కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటించిన ఈయన ఆ తరువాత దర్శకుడిగా అవతారమెత్తి పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. కమలహాసన్, ప్రభులతో వెట్రివిళా చిత్రంతో పాటు మీండుం ఒరు కాదల్ కథై, జీవా, మైడియర్ మార్తాండన్, ఆత్మ, శివల్‌పేరి పాండి వంటి పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు. తెలుగులోనూ కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రతాప్‌పోతన్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. తన తాజా చిత్రానికి మాధవన్, దుల్కర్‌సల్మాన్‌లు నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ఇందులో నటి ధ న్సిక కథానాయకిగా నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement