![Kalyani Priyadarshan To Act Opposite with Dulquer Salmaan - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/17/duluqer.jpg.webp?itok=1xh8LgsL)
మాలీవుడ్ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు దుల్కర్ సల్మాన్. తక్కువకాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యభరిత చిత్రాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు. మాతృభాష మలయాళంలో నటిస్తూనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ సత్తా చాటుతున్నాడు.
తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ఓ కాదల్ కణ్మణి, హే అనామికా వంటి కొత్త తరహా కథా చిత్రాల్లో నటించి అలరించాడు. తెలుగులో మహానటి, సీతారామం వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. తమిళం, మలయాళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్ర తమిళ వెర్షన్‌కు కోలి అనే టైటిల్‌ను నిర్ణయించారు.
అట్లీ శిష్యుడు కార్తీకేయన్ వేలప్పన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌కు జంటగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ నటించనున్నట్లు తెలిసింది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని జీ.స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా మానాడు చిత్రంలో శింబు సరసన నటించిన కల్యాణి ప్రియదర్శన్ తాజాగా కోలీ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దుల్కర్, కల్యాణి ఇద్దరూ గతంలో వరనే అవశ్యముంద్(తెలుగులో పరిణయం) సినిమాలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment