Keerthy Suresh Kalyani Priyadarshan And Others Team Up For Girls Gang - Sakshi
Sakshi News home page

Keerthy Suresh : ఈతరం రీయూనియన్‌.. ఒకే ఫ్రేములో హీరోయిన్స్‌ సందడి

Published Sun, Nov 20 2022 8:38 AM | Last Updated on Sun, Nov 20 2022 10:58 AM

Keerthy Suresh Kalyani Priyadarshan And Others Team Up For Girls Gang - Sakshi

తమిళసినిమా: 1980 తరానికి చెందిన దక్షిణాది స్టార్‌ హీరోహీరోయిన్లు ఏటా రీయూనియన్‌ పేరుతో సరదాగా గడపడం ఆనవాయితీగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ముంబైలో రీయునియన్‌ కార్యక్రమం జరిగింది. కాగా తాజాగా ఈ తరం తారలు రీయూనియన్‌ వేడుకను జరుపుకున్నారు. ఇదిలా ఉండగా కీర్తి సురేష్‌ కూడా ఈతరం హీరోయిన్స్‌తో రీయూనియన్‌ నిర్వహించింది. నటి కీర్తి సురేష్‌ తమిళం, తెలుగు, మలయాళం చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మామన్నన్‌ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

కాగా జయం రవి సరసన నటిస్తున్న సైరన్‌ చిత్ర షూటింగ్‌ ఇటీవలే మొదలైంది అదేవిధంగా తెలుగులో చిరంజీవి కథానాయకుడు నటిస్తున్న భోళాశంకర్‌ చిత్రంలో ఆయనకు చెల్లెలుగా చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్‌కు అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. ఆమెకు ఇన్‌స్ట్రాగామ్‌లో 1.39 కోట్ల పాలోవర్స్‌ ఉన్నారు. కాగా ఇటీవల ఈ బ్యూటీ ఇంట్లో ఈ తరం తారల రీయూనియన్‌ కార్యక్రమం జరిగింది.

నటి కీర్తిసురేష్‌తో పాటు కళ్యాణి ప్రియదర్శన్, పార్వతి తిరువొత్తు, రీమా కళింగళ్, అతిథి బాలన్, ప్రియ మార్టిన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నటి కీర్తి సురేష్‌ తల్లి మేనక ఏర్పాటు చేయడం విశేషం. ఇందులో సీనియర్‌ నటి రాధిక శరత్‌ కుమార్, లిజీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఆ ఫొటోలను కీర్తి సురేష్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ నూతన ఆరంభం అని పేర్కొన్నారు. అత్యుత్తమ మనుషులతో మధురమైన రేయి అని పొందుపరిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement