పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాజు అరుణ్ మొళి వర్మగా ప్రేక్షకుల మన్ననలను పొందిన జయం రవి ఇప్పుడు మళ్లీ రొమాంటిక్ హీరోగా మారబోతున్నారు. ప్రస్తుతం ఈయన సైరన్ చిత్రంలో కీర్తి సురేష్ తోనూ, ఇరైవన్ చిత్రంలో నయనతారతోనూ డ్యూయెట్లు పాడుతున్నారు. కాగా జయం రవి కథానాయకుడిగా వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత రూ.100 కోట్ల బడ్జెట్లో భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఇటీవల ప్రకటింన విషయం తెలిసిందే.
ఈ చిత్రం ద్వారా భువనేశ్ అర్జునన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈయన దర్శకుడు మిష్కిన్ శిష్యుడు అన్నది గమనార్హం. కాగా ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రంలో జయం రవికి జంటగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తాజా సమాచారం. కాగా నటి కృతి శెట్టి ఒక హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
తాజాగా నటి కల్యాణి ప్రియదర్శన్‌ను ఇందులో మరో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మూడో హీరోయిన్ ఎవరనే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చిత్రం జూలైలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధింన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment