సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నటీమణుల్లో కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల వారసురాలైన ఈమె బహుభాషా నటిగా రాణిస్తున్నారు. అయితే ఇప్పటికీ కెరియర్లో సరైన హిట్టు పడలేదు అన్నది వాస్తవం. తరువాత తెలుగులో హలో అంటూ పలకరించిన కల్యాణి ప్రియదర్శన్ ఇక్కడ వరుసగా మూడు చిత్రాలు చేశారు. తొలి చిత్రం హలో నిరాశ పరిచినా, చిత్ర లహరి సినిమా విజయం సాధించింది. అయితే అది నటుడు సాయి ధరమ్ తేజ్ ఖాతాలోనే పడింది. ఇక మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తూ.. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నారు.
తమిళం విషయానికి వస్తే హీరో చిత్రంతో రంగప్రవేశం చేశారు. ఆ తరువాత పుత్రం పొందు కాళై, మానాడు తదితర చిత్రాల్లో నటించారు. శింబు సరసన నటించిన మానాడు చిత్రం విజయం సాధించినప్పటికీ కళ్యాణి ప్రియదర్శన్‌కి పెద్దగా క్రేజీ తీసుకు రాలేదు. అలాంటిది తాజాగా జయం రవి సరసన జీనీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కృతిశెట్టి, వామిక గబ్బీ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని కల్యాణి ప్రియదర్శిన్ వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంలో నటించడం చాలా ఎక్జయిటింగ్ గా ఉందని పేర్కొన్నారు. ఇది తన కెరీర్లో చాలా విలువైన చిత్రంగా మిగిలిపోతుందని నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కథతో రూపొందుతున్న చిత్రమని చెప్పారు. ఇందులో తనది నటించడానికి అవకాశం ఉన్న పాత్ర అని, జీని మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
చదవండి: ప్రెగ్నెన్సీతో పోకిరి భామ.. ఎట్టకేలకు ప్రియుడిని చూపించింది
Comments
Please login to add a commentAdd a comment