వెంకటేష్, రాంచరణ్ కాంబినేషన్ కుదిరింది | Ram Charan, Venkatesh to work together for tollywood film | Sakshi
Sakshi News home page

వెంకటేష్, రాంచరణ్ కాంబినేషన్ కుదిరింది

Published Fri, Nov 1 2013 6:39 PM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

వెంకటేష్, రాంచరణ్ కాంబినేషన్ కుదిరింది

వెంకటేష్, రాంచరణ్ కాంబినేషన్ కుదిరింది

తెలుగులో మరో మల్టీస్టారర్ చిత్రం రాబోతోంది. విక్టరీ వెంకటేష్, మెగా పవర్స్టార్ రాంచరణ్ తేజ ఇద్దరూ కలసి ఓ సినిమాలో నటించనున్నారు. ఇందుకు వీరిద్దరూ అంగీకరించారని నిర్మాత బండ్ల గణేష్ వెల్లడించారు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు.

'అభిమానులకిది నా దీపావళి కానుక. వారితో కలసి పనిచేసే అవకాశమిచ్చిన ఇద్దరు హీరోలకూ కృతజ్ఞతలు. వెంకటేష్ తన సినిమాను పూర్తిచేశారు. వీలైనంత త్వరగా కొత్త ప్రాజెక్ట్ను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం' అని గణేష్ చెప్పారు. కాగా రాంచరణ్తో చేసే సినిమా వెంకటేష్కు మూడో మల్టీస్టారర్ చిత్రమవుతుంది. మహేష్ బాబుతో కలసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్తో కలసి తాజాగా 'మసాలా' చిత్రాల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement