మల్టీస్టారర్‌కి రెడీ? | Venkatesh - Ravi Teja multi-starrer on the cards | Sakshi
Sakshi News home page

మల్టీస్టారర్‌కి రెడీ?

Published Mon, Jul 21 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

మల్టీస్టారర్‌కి రెడీ?

మల్టీస్టారర్‌కి రెడీ?

 తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టడమే కాదు, దాన్ని కొనసాగించే బాధ్యతను కూడా తలకెత్తుకున్నారు వెంకటేశ్. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రంలో మహేశ్‌తో కలిసి నటించి ఈ ట్రెండ్‌ని మొదలుపెట్టిన ఆయన.. రామ్‌తో ‘మసాలా’ చేశారు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో ‘గోపాల గోపాల’ చేస్తున్నారు. ఇలా వరుస పెట్టి మల్టీస్టారర్లు చేస్తూ మిగిలిన హీరోలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకీ. ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త ఏంటంటే... వెంకటేశ్ మరో మల్టీస్టారర్‌కి పచ్చజెండా ఊపేశారట. ఈ దఫా వెంకటేశ్‌తో నటించే స్టార్‌గా రవితేజ పేరు వినిపిస్తుండగా, వీరిద్దరినీ డెరైక్ట్ చేసే ఛాన్స్‌ని వీరు పోట్ల దక్కించుకున్నట్లు ఫిలింనగర్ టాక్.
 
 వీరు పోట్ల చెప్పిన లైన్ వెంకీ, రవితేజలకు నచ్చడంతో పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేయవలసిందిగా వీరును పురమాయించారట వెంకీ, రవితేజ. ప్రస్తుతం ఈ దర్శక, రచయిత... కథ సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆద్యంతం హాస్యభరితంగా, ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తేలా వీరు పోట్ల కథను సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. కామెడీని పండించడంలో వెంకటేశ్, రవితేజ ఇద్దరూ సిద్ధహస్తులే. వీరి కామెడీ టైమింగ్‌ను ఇష్టపడనివారుండరంటే అతిశయోక్తికాదు. మరి వీరిద్దరూ కలిసి తెరను పంచుకుంటే... సినీ హాస్య ప్రియులకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది?. ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీ నవంబర్‌లో సెట్స్‌కి వెళ్లనుందని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement