మహేశ్‌బాబు
మహేశ్‌బాబు నెక్ట్స్ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురు చూసే అభిమానులకు శుభవార్త. ఆయన నెక్ట్స్ సినిమా షూటింగ్ డెహ్రాడూన్‌లో స్టార్ట్ కానుందని సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమాను అశ్వనీదత్, ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయి.
డెహ్రాడూన్‌లో షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత స్మాల్ గ్యాప్ ఇచ్చి, నెక్ట్స్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాకు కేయూ మోహనన్ ఛాయాగ్రాహకుడు. ఆయన డెహ్రాడూన్ అందాలను అద్భుతంగా క్యాప్చర్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో.. మహేశ్ అండ్ టీమ్ కొన్ని రోజుల పాటు డెహ్రాడూన్‌లో పాగా వేస్తారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment