నో కన్‌ఫ్యూజన్‌... ఫుల్‌ క్లారిటీ! | Rakul Preet As Heroine In Mahesh Babu Vamsi Paidipally Movie | Sakshi
Sakshi News home page

నో కన్‌ఫ్యూజన్‌... ఫుల్‌ క్లారిటీ!

Published Tue, Nov 21 2017 12:08 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Rakul Preet As Heroine In Mahesh Babu Vamsi Paidipally Movie  - Sakshi - Sakshi

‘రౌండప్‌ చేసి కన్‌ఫ్యూజ్‌ చెయ్యొద్దు. ఎందుకంటే... కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను’ – ‘బిజినెస్‌మేన్‌’లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌ ఇది! జస్ట్‌... పూరి జగన్నాథ్‌ సినిమాలో, పూరి రాసిన హీరో క్యారెక్టర్‌కు తగ్గట్టు చెప్పిన డైలాగ్‌ మాత్రమే. రియల్‌ లైఫ్‌లో మహేశ్‌ కన్‌ఫ్యూజ్‌ కావడమనే క్వశ్చనే లేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ చేస్తున్నారు. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సి. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు నిర్మించనున్న సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ పనులు, కథపై కాన్సంట్రేట్‌ చేస్తున్నారు.

వంశీ పైడిపల్లి సినిమా తర్వాత చేయబోయే సినిమా కోసం కథలు కూడా వింటున్నారు. చుట్టూ ఎంత మంది దర్శకులున్నా... ఎన్ని పనులున్నా... నో కన్‌ఫ్యూజన్‌! ఫుల్‌ క్లారిటీతో ఓ పని పూరై్తన తర్వాత మరో పని మీద దృష్టి పెడుతున్నారు. కొరటాల శివ సినిమాకు ‘భరత్‌ అనే నేను’ టైటిల్‌ పరిశీలనలో ఉందనే సంగతి తెలిసిందే.

ఆ సినిమా చిత్రీకరణ పూరై్తన వెంటనే వంశీ పైడిపల్లి సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారట.మధ్యలో విశ్రాంతి కూడా తీసుకోరని సమాచారమ్‌. వచ్చే ఏడాది మార్చికి ‘భరత్‌ అనే నేను’ చిత్రీకరణ అంతా పూర్తవుతుందట! నెక్ట్స్‌... వంశీ పైడిపల్లి సినిమాలో మహేశ్‌బాబుకు జోడీగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ఆల్మోస్ట్‌ కన్ఫర్మ్‌ చేశారట!! ఆల్రెడీ అమెరికాలో దర్శక–నిర్మాతలు ఈ సినిమా కోసం లొకేషన్లు, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో మూడు పాటలు ఫైనలైజ్‌ చేశారు. మహేశ్‌ రెడీ అనగానే షూటింగ్‌ స్టార్ట్‌ చేసేయడమే!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement