
మహేష్ బాబు హీరోగా మహర్షి సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు వంశీ పైడిపల్లి, తదుపరి చిత్రాన్ని కూడా కన్ఫామ్ చేశాడు. ఇప్పటికే మహర్షి పనులు చివరి దశకు చేరుకోవటంతో నెక్ట్స్ సినిమా పనులు ప్రారంభించారన్న టాక్ వినిపిస్తోంది. తన నెక్ట్స్ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట వంశీ.
గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఎవడు సినిమా సక్సెస్ కావటంతో నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్‌ఆర్‌ఆర్ పనుల్లో బిజీగా ఉన్నాడు చెర్రీ. ఈ సినిమా 2020 జూలైలో రిలీజ్‌కానుంది. అంటే అప్పటి వరకు చరణ్ బిజీగా ఉంటాడు. ఆ తరువాతే వంశీ, చరణ్ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.