Vijay Thalapathy 66th Movie: Rashmika Mandanna, Vijay Thalapathy Photos Leaked From Shooting Spot - Sakshi
Sakshi News home page

Vijay 66: విజయ్‌, రష్మికల షూటింగ్‌ ఫొటోలు లీక్‌.. డైరెక్టర్‌ అప్‌సెట్‌

Published Mon, Jun 13 2022 4:13 PM | Last Updated on Mon, Jun 13 2022 4:27 PM

Thalapathy Vijay, Rashmika Mandanna Photos Leaked from Shooting Spot - Sakshi

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ​ 66వ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల హైదరాబాద్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీ షూటింగ్‌ లోకేషన్స్‌కు సంబంధించిన పలు ఫొటోలు బయటకు వచ్చాయి. హైదరాబాద్‌లోని ఓ నర్సరీలో చిత్రికరించిన సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకయ్యాయి. దీంతో దర్శకుడు వంశీ పైడిపల్లి ఆసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. దీంతో మూవీ బృందానికి స్ట్రిక్ట్‌ కండిషన్స్‌ పెట్టాడట. ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు షూటింగ్‌ స్పాట్‌లో ఎవరిని మొబైల్‌ ఫోన్స్‌ అనుమతించడం లేదని సమాచారం.

చదవండి: వెకేషన్‌లో చరణ్‌, ఉపాసన.. క్యూట్‌ పిక్‌ షేర్‌ చేసిన మెగా హీరో

హైదరాబాద్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ నర్సరీలో విజయ్‌, రష్మికలకు సంబంధించిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరిగింది. ఇందులో విజయ్‌ క్యాజువల్‌ డ్రెస్‌లో ఉండగా.. రష్మిక పోట్టి ఫ్రాక్‌లో కనిపించింది. ఆ నర్సరీ రోడ్డు పక్కనే ఉండటంతో వాహనదారులంతా ఆగి మరి షూటింగ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వంశీ రూపొందిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. 

చదవండి: ఆ హీరో నన్ను అలా పిలవడం ఇష్టం లేదు: రష్మిక షాకింగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement