
తెలుగు, తమిళ భాషల్లో విజయ్ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం వారీసు(తెలుగులో వారసుడు). ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది విజయ్‌కి స్పెషల్ చిత్రం అని చెప్పాలి.
చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై
ఎందుకంటే ఇప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఈ మూవీతో నేరుగా పలకిరించబోతున్నాడు. దీంతో ఈ మూవీ కథ, కథనాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇప్పటికే చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 4వ షెడ్యూల్‌ను ఇటీవలే హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. త్వరలో విశాఖపట్టణంలో షూటింగ్‌కు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోందని సమాచారం. ఇలాంటి సందర్భంలో వారీసు, చిత్ర అప్‌డేట్‌ను నటుడు శరత్‌కుమార్ వెల్లడించారు.
చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
ఇది కుటుంబ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్, రొమాన్స్ అంటూ జనరంజిక కథా చిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా విజయ్ అభిమానులు కోరుకునే విధంగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయన్నారు. మరో విషయం ఏమిటంటే ఇందులో ఒక్క పాత్రలోనే కనిపిస్తారని స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. విజయ్ అభిమానులకు ఈ చిత్రం డబుల్ ధమాకా అవుతుందట!
Comments
Please login to add a commentAdd a comment