Thalapathy 66 Update: Vijay Varasudu Movie Second Look Goes Viral - Sakshi
Sakshi News home page

Thalapathy66 Update: వారసుడు నుంచి విజయ్‌ సెకండ్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌

Published Wed, Jun 22 2022 4:35 PM | Last Updated on Wed, Jun 22 2022 5:54 PM

Thalapathy 66: Vijay Second Look Release From Varasudu Movie - Sakshi

తమిళ స్టార్‌ దళపతి విజయ్‌ బర్త్‌డే సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక తమిళనాట అయితే విజయ్‌ పుట్టిన రోజు వేడుకలను ఫ్యాన్స్‌ గ్రాండ్‌ సెలబ్రెట్‌ చేస్తున్నారు. విజయ్‌కి పలువురు సినీ ప్రముఖులు సైతం విషెస్‌ తెలుపుతున్నారు. అంతేకాదు ఆయన బర్త్‌డే సందర్భంగా విజయ్‌ సిని​మాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంతో తెరకెక్కుతున్న విజయ్‌ 66 మూవీకి సంబంధించిన మరో అప్‌డేట్‌ను తాజాగా వదిలారు మేకర్స్‌. నిన్న ఈమూవీ టైటిల్‌తో పాటు విజయ్‌ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చిత్రం బృందం రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: Vijay As Varisu: వారసుడుగా వస్తోన్న దళపతి విజయ్‌

వారిసు(తెలుగులో వారసుడు) అని టైటిల్‌ ఖారారు చేశారు ఈ మూవీకి. తాజాగా ఈ చిత్రంలోని విజయ్‌కి సంబంధించిన మరోలుక్‌ వదిలారు. చూట్టూ పిల్లలు, గాలి పటాలు, చెరుకు గడలు మధ్య ఎండ్ల బండిలో పడుకుని ఆకాశం వైపు చూస్తూ కనిపించాడు విజయ్‌. ఈ సెకండ్‌ లుక్‌ పోస్టర్‌ చూస్తుంటే సంక్రాంతిని గుర్తు చేస్తుంది. అంటే ఇందులో విజయ్‌ పలు షేడ్స్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. కాగా ఇందులో సరదాగా నవ్వుతూ కనిపించిన విజయ్‌ లుక్‌కు అతడి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దీంతో విజయ్‌ కొత్తలుక్‌ పలు సోషల్‌ మీడియాల్లో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. 

చదవండి: ఓటీటీకి అంటే సుందరానికి, స్ట్రీమింగ్‌ డేట్‌, టైం ఫిక్స్‌.. ఎక్కడంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement