
తమిళ హీరో విజయ్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గత నాలుగేళ్లుగా విజయ్ నటించిన చిత్రాలు అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఒకేసారి విడుదల అవుతున్నాయి. సర్కార్, అదిరింది, విజిల్, మాస్టర్ వంటి చిత్రాలు విజయ్‌కి ఇక్కడ అభిమానులను సంపాదించిపెట్టాయి. ఈ చిత్రాలకు లభించిన ఆదరణను చూసి, తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలని నిర్ణయించుకున్నారట విజయ్.
‘బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి చెప్పిన కథను విన్నారట. ఈ కథ విజయ్‌కి నచ్చిందని, త్వరలో వీరిద్దరి కాంబినేషన్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని ఫిల్మ్‌నగర్ టాక్.
చదవండి: మనవరాలికి ఇళయరాజా సంగీత పాఠాలు
Comments
Please login to add a commentAdd a comment