ఇచ్చాడయ్యో...హామీ | Will Mahesh Babu Prefer Sukumar Over Trivikram Srinivas? | Sakshi
Sakshi News home page

ఇచ్చాడయ్యో...హామీ

Published Thu, Apr 12 2018 12:06 AM | Last Updated on Thu, May 10 2018 12:13 PM

Will Mahesh Babu Prefer Sukumar Over Trivikram Srinivas? - Sakshi

మహేశ్‌బాబు, సుకుమార్‌

‘భరత్‌ అనే నేను’లో ‘వచ్చాడయ్యో సామీ..’ అనే పాట చాలా పాపులర్‌ అయిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. నెక్ట్స్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేశ్‌ ఎప్పుడో హామీ ఇచ్చేశారు. ఇప్పుడు మరో సినిమాకి హామీ ఇచ్చారు. మహేశ్‌బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. నాలుగేళ్ల క్రితం మహేశ్‌బాబుతో ‘1 నేనొక్కడినే’ వంటి క్లాస్‌ అండ్‌ డీసెంట్‌ మూవీని తెరకెక్కించిన సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడని సమాచారం.

వారంలోపు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, మహేశ్‌తో సుకుమార్‌కి ఇది రెండో సినిమా అయితే ‘రంగస్థలం’ తర్వాత ఇమీడియట్‌గా మైత్రీతో కూడా సుకుమార్‌కి ఇది రెండో సినిమా అవుతుంది. వంశీ పైడిపల్లితో చేయనున్న సినిమా, సుకుమార్‌తో చేయనున్న సినిమా షూటింగ్స్‌ కొంచెం అటూ ఇటూగా జరుగుతాయట. సో.. రానున్న రోజుల్లో ఈ రెండు చిత్రాలతో మహేశ్‌ ఫుల్‌ బిజీ అన్నమాట. ప్రస్తుతం మహేశ్‌బాబు స్మాల్‌ ట్రిప్‌ కోసం ఫారిన్‌ వెళ్లారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement