ఆరు దశాబ్దాల వెనక్కి? | mahesh babu, sukumar new movie starts in december | Sakshi
Sakshi News home page

ఆరు దశాబ్దాల వెనక్కి?

Published Thu, Oct 18 2018 12:26 AM | Last Updated on Thu, Oct 18 2018 12:26 AM

mahesh babu, sukumar new movie starts in december - Sakshi

మహేశ్‌బాబు

‘రంగస్థలం’ సినిమాలో రామ్‌చరణ్‌ను 1980లోకి తీసుకెళ్లి సూపర్‌హిట్‌ను ఖాతాలో వేసుకున్న సుకుమార్‌ ఇప్పుడు మహేశ్‌బాబును దాదాపు 60 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లనున్నారని ఫిల్మ్‌ నగర్‌లో ప్రచారం జరుగుతోంది. మహేశ్‌బాబు హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా కథను సుకుమార్‌ రెడీ చేస్తున్నారని టాక్‌.

నాలుగేళ్ల క్రితం మహేశ్‌బాబు –సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘1:నేనొక్కడినే’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా షూటింగ్‌ ఈ ఏడాది డిసెంబర్‌ చివర్లో స్టార్ట్‌ అవుతుందట. ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు మహేశ్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement