సినిమా చాలా అద్భుతంగా ఉంది: మహేశ్ బాబు ప్రశంసలు | Mahesh Babu Praises Latest Tollywood Movie Maruthi Nagar Subramanyam, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Mahesh Babu On Maruthi Nagar Subramanyam: ఇటీవల వచ్చిన సినిమాల్లో ది బెస్ట్‌

Published Sun, Sep 1 2024 7:20 AM | Last Updated on Sun, Sep 1 2024 1:15 PM

Tolywood Hero Mahesh Babu Praises Latest Tollywood Movie

ఇటీవల రిలీజై థియేటర్లలో సందడి చేస్తోన్న మూవీపై సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ప్రశంసలు కురిపించారు. ఈ మధ్య వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇదేనని అన్నారు. ఈ మేరకు ఆయన చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అంతే కాకుండా ఈ చిత్ర నిర్మాత అయిన తబిత సుకుమార్‌ను అభినందించారు.‍

తబిత రిప్లై.. 

అయితే మహేశ్ బాబు తమ సినిమాను అభినందించడంపై తబిత సుకుమార్ స్పందించారు. మా సినిమాను చూసి మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీ సపోర్ట్‌ లభించడం మా మూవీకి పెద్ద ఘనత అన్నారు.  మారుతీనగర్ సుబ్రమణ్యం చిత్రాన్ని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 

లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో తెరకెక్కించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మారుతీనగర్‌ సుబ్రమణ్యం. ఈ చిత్రంలో రావు రమేశ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు సుకుమార్‌ భార్య తబిత నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అంకిత్‌ కొయ్య, ఇంద్రజ, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్ట్‌ 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement