వేసవి ముగిశాక కొత్త సినిమా | Katrina Kaif to romance Mahesh Babu in Sukumar's next movie | Sakshi
Sakshi News home page

వేసవి ముగిశాక కొత్త సినిమా

Published Sun, Jan 6 2019 2:59 AM | Last Updated on Sun, Jan 6 2019 2:59 AM

Katrina Kaif to romance Mahesh Babu in Sukumar's next movie - Sakshi

మహేశ్‌బాబు

‘వన్‌ : నేనొక్కడినే’ కాంబినేషన్‌ (సుకుమార్‌– మహేశ్‌బాబు) వన్స్‌మోర్‌ రిపీట్‌ కానుందన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో మంచి ఆసక్తి ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని ఎదురు చూస్తున్నారు. సుకుమార్‌ కథ తయారు చేసే పని మీద ఉన్నారనే వార్త ప్రచారంలో ఉంది. తాజా సమాచారమేంటంటే సుకుమార్‌ కథ అవుట్‌లైన్‌ను తయారు చేసేశారట. అలాగే మహేశ్‌కు వినిపించడం కూడా జరిగిపోయిందట. ఈ కథ మహేశ్‌కు చాలా బాగా నచ్చిందని, ప్రాజెక్ట్‌ పట్ల చాలా ఎగై్జటింగ్‌గా ఉన్నారని టాక్‌. ప్రస్తుతం సుక్కూ కథ పూర్తి స్థాయి ప్రిపరేషన్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పనులు మొదలెట్టారని సమాచారం.

మహేశ్‌ కెరీర్‌లో మునుపెన్నడూ చూడనటువంటి కమర్షియల్‌ చిత్రంగా ఈ సినిమా ఉండబోతోందట. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై రవిశంకర్, మోహన్‌ చెరుకూరి, నవీన్‌ యర్నేని నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ నెల నుంచి ప్రారంభం కానుందట. ఇందులో మహేశ్‌ సరసన బాలీవుడ్‌ భామ కత్రినా కైఫ్‌ నటించొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. మహేశ్‌ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది. మే నెల హాలిడే తీసుకొని జూన్‌లో సుక్కూ సినిమా సెట్లో అడుగుపెడతారని ఊహించవచ్చు. సో.. వేసవి ముగిశాక కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటారన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement