అడవిలో వేట! | Maharshi to hit screens on April 25 | Sakshi
Sakshi News home page

అడవిలో వేట!

Published Thu, Jan 24 2019 1:22 AM | Last Updated on Sun, Apr 7 2019 12:28 PM

Maharshi to hit screens on April 25 - Sakshi

మహేశ్‌బాబు

మహేశ్‌బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 25న విడుదల కానుంది. ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌లో ప్రారంభం అవుతుంది. తాజాగా ఈ సినిమా కథనం సింహాచలం అడవుల నేపథ్యంలో సాగుతుందనే వార్త ప్రచారంలోకొచ్చింది. ఇది రీవెంజ్‌ డ్రామా అట. అంతేకాదు ఈ సినిమాలో మహేశ్‌బాబు లుక్‌ ఫుల్‌ గడ్డంతో ఉంటుందట. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే అడవిలో మహేశ్‌ వేట ఆడియన్స్‌కు మంచి కిక్‌ ఇస్తుందని చెప్పుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement