
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ ఆన్‌లైన్ సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పింది. అంతేకాదు కొందరు మహేష్ ఫ్యాన్స్ ఈ టీజర్‌కు యానిమేటెడ్ వర్షన్‌ను రూపొందించారు.
టీజర్‌లోని సీన్స్, క్యారెక్టర్స్‌ను 2డీ యానిమేషన్‌లో రూపొందించిన ఈ టీజర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ యానిమేటెడ్ టీజర్‌పై స్పందించిన మహర్షి చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ‘టీజర్ అద్భుతంగా ఉంది. మీరు ప్రతీ సినిమాను మాకు ప్రత్యేకంగా మార్చేస్తున్నారు. మీకు రుణపడి ఉంటాం, ఈ వీడియో రూపొందించిన మహేష్ అభిమానులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు.
దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment