మణిశర్మ, తమన్‌.. ఇప్పుడు అనిరుద్‌? | Mahesh Babu Vamshi Paidipally Movie: Who are Music Director | Sakshi
Sakshi News home page

మణిశర్మ, తమన్‌.. ఇప్పుడు అనిరుద్‌?

Published Tue, Feb 18 2020 9:29 AM | Last Updated on Tue, Feb 18 2020 9:34 AM

Mahesh Babu Vamshi Paidipally Movie: Who are Music Director - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్వకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ వేసవి తర్వాత ప్రారంభం కానుందట. అయితే సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పట్నుంచి ఎన్నో వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కథ ఇదేనంటూ, హీరోయిన్ ఈవిడేనంటూ అనేక గాసిప్స్‌ వచ్చాయి. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరనేదానిపై అటు మహేశ్‌ ప్యాన్స్‌తో పాటు టాలీవుడ్‌ ఆభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా వారికి ఊహకందిన పేర్లను సూచిస్తూ మహేశ్‌ సినిమాకు సంగీత దర్శకుడు ఇతడేనంటూ పేర్కొంటున్నారు. 

ఈ జాబితాలో ఎక్కువగా వినిపించిన పేరు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. తిరిగి మునపటి ఫామ్‌లోకి వచ్చిన  మణిశర్మ మహేశ్‌ తాజా చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారని తొలుత వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో హిట్‌ సాంగ్స్‌ వచ్చాయి. దీంతో డైరెక్టర్‌ వంశీ మణిశర్మ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ‘అల.. వైకుంఠపురుములో’ మ్యూజిక్‌ ఆల్బమ్‌తో మ్యాజిక్‌ చేసిన క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ పేరును కూడా చిత్ర బృందం పరిశీలిస్తోందని మరో టాక్‌. మహేశ్‌-తమన్‌ కలయికలో వచ్చిన దూకుడు, బిజినెస్‌మన్‌ సినిమాల్లోని పాటలు సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. దీంతో ఈ సినిమాకు తమనే సంగీత దర్శకుడు అంటూ ఊహాగానాలు మరింతగా పెరిగాయి. 

తాజాగా మరో సంగీత దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అజ్ఞాతవాసి, గ్యాంగ్‌లీడర్‌ చిత్రాలతో తెలుగువారికి సుపరిచితుడైన అనిరుద్‌ రవిచంద్రన్‌ మహేశ్‌-వంశీ చిత్రానికి సంగీతం అందిచనున్నాడని టాలీవుడ్‌లో వినిపిస్తోంది. అంతేకాకుండా మహేశ్‌, వంశీలకు మంచి స్నేహితుడైన రాక్‌ స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి చిత్ర బృందం ఎవరిని ఫైనల్‌ చేస్తుందో వేచి చూడాలి. మ్యూజిక్‌ డైరెక్టర్‌తో పాటు ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల గురించి మహేశ్‌ విదేశాల నుంచి తిరిగొచ్చాక ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది. 


చదవండి:
నాది చాలా బోరింగ్‌ లైఫ్‌!
‘ప్రతి అమ్మాయి కలలుగనే ప్రపంచాన్ని అందించావ్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement