Singer Thaman Strong Counter To Trollers Over Mahesh Babu Guntur Karam Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Thaman Reacts To Trolls: మహేష్ బాబుతో గొడవలు.. థమన్‌ రియాక్షన్‌ ఇదే

Published Tue, Jun 20 2023 8:05 AM | Last Updated on Tue, Jun 20 2023 9:10 AM

Thaman Strong Counter On Trollers Mahesh Babu Movie - Sakshi

మహేష్ బాబు-త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ను తప్పిస్తున్నట్లు  టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. రెండురోజులగా ఇదే టాపిక్‌పై పలు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  అంతే కాకుండా మహేష్ బాబుతో థమన్‌కు విబేధాలు వచ్చాయని, అందుకే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి రూమర్స్‌కు తాజాగా థమన్ షాకింగ్ ట్వీట్ చేయడంతో విషయం హాట్ టాపిక్‌గా మారింది.

(ఇదీ చదవండి: తల్లిదండ్రులైన రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులు)

'నా స్టూడియో దగ్గర ఒక మజ్జిగ స్టాల్‌ను ప్రారంభిస్తున్నాను. ఎవరైనా కడుపు మంట లక్షణాలతో బాధపడుతుంటే.. వారందరికి స్వాగతం. కనీసం దీనితోనైనా కోలుకుంటారు. దయచేసి నా సమయాన్ని వృధా చేయకండి.. నాకు చాలా పనులు ఉన్నాయి. గుడ్ నైట్' అంటూ ట్వీట్‌ ద్వారా తెలిపాడు.  ట్రోల్స్ పై సెలబ్రీటీలు ఎవరూ పెద్దగా రెస్పాండ్ కారు. కాని తమన్ మాత్రం తనపై జరిగే ట్రోల్స్ కి సమాధానం చెప్పడంతో పాటు ఒక్కోసారి కౌంటర్స్ కూడా ఇదే రేంజ్‌లోనే ఇస్తాడు. దీంతో అసలు ఈ విషయం తెలియని వాళ్ళు ఏమైంది అన్నా.. అని అంటుండగా, కొందరు మాత్రం మహేష్‌ సినిమా మేకర్స్‌ అయినా స్పందిస్తే బాగుంటుంది కదా? అంటున్నారు.

(ఇదీ చదవండి: తమన్నా చేసిన పనితో ఆందోళనలో జైలర్‌ యూనిట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement