![SS Rajamouli And Other Star Directors Watched Romantic Movie Premiere Show - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/28/Romantic-Movie-Premiere-Sho.jpg.webp?itok=ILUiIZv_)
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీ శుక్రవారం(అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్ ప్రీమియర్ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేశారు.
చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు
దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన సతిమణి, అనిల్ రావిపూడి, మెహర్ రమేశ్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, బాబీ, గుణశేఖర్, అలీ, సత్యదేవ్, విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండతో పాటు రొమాంటి చిత్ర బృందం, పూరీ, ఛార్మీలు పలువురు సినీ సెలబ్రెటీలు ఈ ప్రీమియర్ షోని వీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘రొమాంటిక్’ సినిమా చాలా బాగుందని.. హీరోగా ఆకాశ్ తప్పకుండా విజయం సాధిస్తాడని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రీమియర్ షోకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికాశర్మ హీరోయిన్‌గా నటించింది.
చదవండి: భార్య విరానికాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment