![Rajamouli Comments On Romantic Movie After Watching Premier Show - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/28/rajamouli-1.jpg.webp?itok=t2hUeZVp)
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ తాజా చిత్రం రొమాంటిక్. ఈ మూవీ అక్టోబర్ 29(శుక్రవారం) విడుదలకు సిద్దమైన సంగితి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ మూవీ ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ షోకు దర్శకుడు ధీరుడు రాజమౌళి కుటంబ సమేతంగా వచ్చి వీక్షించారు. అలాగే స్టార్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు బాస్కర్, గొపిచంద్ మిలినేని, బాబీ, మెహర్ రమేశ్‌లతో పలువురు నటీనటులు ఈ పీమియర్ షోకు హజరయ్యారు. ఈ షో చూసిన అనంతరం డైరెక్టర్లంతా మీడియాతో మాట్లాడుతూ రొమాంటిక్ మూవీ బాగుందని, ఇది ఆకాశ్ కెరీర్‌కు మైల్‌స్టోన్ అవుతుందని కితాబిచ్చారు.
చదవండి: ChaySam Divorce: సమంత పోస్ట్‌పై వెంకటేశ్ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్
అలాగే రాజమౌళి కూడా మీడియాతో మాట్లాడుతూ రొమాంటిక్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పుడే సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. ఇది కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. సినిమా గురించి ఏదైనా వంక పెడితే ముసలోడివై పోయావ్…నీకెం తెలుసు అంటారేమోనని భయంగా ఉంది. అనిల్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. తన మనసులో ఏదనిపిస్తే అది లెక్కలు వేసుకోకుండా మరీ చిత్రాన్ని రూపొందించాడు. ఆకాశ్, కేతికల రూపంలో డైరెక్టర్‌కు అద్భుతమైన జోడీ దొరికింది. ఇక ఆకాశ్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా అతడిని మరోమెట్టు ఎక్కిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ బాగా ఆకట్టుకుంది. మన సినిమా ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి:
‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్
భార్య విరానికాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
#ssrajamouli at #Romantic Special Premiere. Talks about the film.#RomanticOnOCT29th pic.twitter.com/tdORbZtdPc
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 28, 2021
Comments
Please login to add a commentAdd a comment