Premier Show
-
పుష్ప-2 ప్రీమియర్ షోలో అపశ్రుతి
-
‘రొమాంటిక్’ మూవీపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ తాజా చిత్రం రొమాంటిక్. ఈ మూవీ అక్టోబర్ 29(శుక్రవారం) విడుదలకు సిద్దమైన సంగితి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ మూవీ ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ షోకు దర్శకుడు ధీరుడు రాజమౌళి కుటంబ సమేతంగా వచ్చి వీక్షించారు. అలాగే స్టార్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు బాస్కర్, గొపిచంద్ మిలినేని, బాబీ, మెహర్ రమేశ్‌లతో పలువురు నటీనటులు ఈ పీమియర్ షోకు హజరయ్యారు. ఈ షో చూసిన అనంతరం డైరెక్టర్లంతా మీడియాతో మాట్లాడుతూ రొమాంటిక్ మూవీ బాగుందని, ఇది ఆకాశ్ కెరీర్‌కు మైల్స్టోన్ అవుతుందని కితాబిచ్చారు. చదవండి: ChaySam Divorce: సమంత పోస్ట్‌పై వెంకటేశ్ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్ అలాగే రాజమౌళి కూడా మీడియాతో మాట్లాడుతూ రొమాంటిక్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పుడే సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. ఇది కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. సినిమా గురించి ఏదైనా వంక పెడితే ముసలోడివై పోయావ్…నీకెం తెలుసు అంటారేమోనని భయంగా ఉంది. అనిల్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. తన మనసులో ఏదనిపిస్తే అది లెక్కలు వేసుకోకుండా మరీ చిత్రాన్ని రూపొందించాడు. ఆకాశ్, కేతికల రూపంలో డైరెక్టర్‌కు అద్భుతమైన జోడీ దొరికింది. ఇక ఆకాశ్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా అతడిని మరోమెట్టు ఎక్కిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బాగా ఆకట్టుకుంది. మన సినిమా ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్ భార్య విరానికాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు #ssrajamouli at #Romantic Special Premiere. Talks about the film.#RomanticOnOCT29th pic.twitter.com/tdORbZtdPc — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 28, 2021 -
‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీ శుక్రవారం(అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్ ప్రీమియర్ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేశారు. చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన సతిమణి, అనిల్ రావిపూడి, మెహర్ రమేశ్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, బాబీ, గుణశేఖర్, అలీ, సత్యదేవ్, విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండతో పాటు రొమాంటి చిత్ర బృందం, పూరీ, ఛార్మీలు పలువురు సినీ సెలబ్రెటీలు ఈ ప్రీమియర్ షోని వీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘రొమాంటిక్’ సినిమా చాలా బాగుందని.. హీరోగా ఆకాశ్ తప్పకుండా విజయం సాధిస్తాడని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రీమియర్ షోకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికాశర్మ హీరోయిన్గా నటించింది. చదవండి: భార్య విరానికాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రొమాంటిక్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు
-
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ప్రీమియర్ షో
-
యాత్ర తొలి టికెట్ @ రూ.4.37లక్షలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను వేలం వేయగా మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు (దాదాపు 4.37 లక్షలు) సొంతం చేసుకుని వైఎస్‌పై తనకున్న అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘యాత్ర’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ నెలకొంది. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సంస్థలు అమెరికాలోని సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను వేలం వేయగా వైఎస్‌గారి అభిమాని మునీశ్వర్ రెడ్డి భారీ మొత్తాన్ని చెల్లించి మొదటి టికెట్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన డబ్బులో టికెట్‌కి సరిపడా 12 డాలర్లు (దాదాపు 860) మాత్రమే తీసుకుని, మిగతా డబ్బుని వైఎస్సార్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తాం. రాజన్న క్యాంటీన్స్, వాటర్ ప్లాంట్స్ కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు. ఈ వేలంలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు. వైఎస్‌గారి పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్రలో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు. -
హాలీవుడ్ హిట్ వాక్
ఫిలిప్ పెటిట్ అనే హై వైర్ ఆర్టిస్ట్ చేసిన సాహసం ప్రపంచానికి ముచ్చెమటలు పట్టించి ఒక్కసారిగా నివ్వెరపోయేలా చేసింది ఆ సాహసమే ఇప్పుడు హాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. లేటెస్ట్ హాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘ద వాక్’కి ఫిలిప్ పెటిట్ జీవితమే కథావస్తువు... 2015 సెప్టెంబరు 30 న్యూయార్క్‌లోని ‘ద వాక్’ ప్రీమియర్ షో హీరో రెండు భారీ బహుళ అంతస్తుల భవనాల మధ్య కేబుల్ మీద నడిచే సీన్. ఆ టవర్లు సుమారు 1300 అడుగుల పైగా హైట్. పై నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరిగి గుండె ఆగిపోతుంది. అసలే త్రీడీ ఫార్మట్. దాంతో ప్రేక్షకులు కూడా అంత హైట్‌లో ఉన్నట్టు ఫీలయ్యారు. ఒకటి కాదు... రెండు కాదు... ముప్పావు గంటలో అటూ ఇటూ ఎనిమిది సార్లు నడిచాడు. అలా నడుస్తూ కూడా మధ్యలో ఒంటి కాలి మీద నిలబడ్డాడు. దాని మీద అలా నడుం వాల్చాడు. ఆ ఎపిసోడ్ చూసి కొంతమంది ప్రేక్షకులు భయపడి వాంతులు కూడా చేసుకున్నారు. ఇదంతా ‘ద వాక్’ సినిమా క్లయిమాక్స్ మహాత్మ్యం. రియల్ ఇన్స్పిరేషన్ ‘ఫారెస్ట్ గంప్’, ‘కాస్ట్ ఎవే’ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు రాబర్ట్ జెమికిస్ ఓ పుస్తకం చదువుతున్నాడు. చివరి పేజీలు మాత్రం అతణ్ణి ఊపిరి తీసుకోనివ్వకుండా చేశాయి. ఆ పుస్తకం - ఫ్రెంచ్ హైవైర్ ఆర్టిస్ట్ ఫిలిప్ పెటిట్ రాసిన ‘టు రీచ్ ద క్లౌడ్స్’. 1974లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు చెందిన ట్విన్ టవర్స్ మధ్య నడిచి సంచలనం సృష్టించిన ఫిలిప్ పెటిట్ తన జీవితానుభ వాలతో ఆ పుస్తకం రాశాడు. 2006 నుంచి ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు రాబర్ట్. 2008లో జేమ్స్ మార్ష్ ఇతని జీవితం ఆధారంగా ‘మ్యాన్ ఆన్ ద వైర్’ డాక్యుమెంటరీ తీసి ఆస్కార్ సాధించాడు. కథ ఏమిటంటే... చిన్నతనంలో ఫిలిప్ పెటిట్‌ను సర్కస్‌లో ఓ వ్యక్తి తాడు మీద నడవడం ఆకర్షిస్తుంది. ఎప్పటికైనా అంత ఎత్తులో ఓ తాడు మీద నడవాలనేది లక్ష్యంగా మారుతుంది. ఎవరూ చేయలేనిది చేయాలనే కసి. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చే స్తూ ఉంటాడు. ఓ రోజు ఏదో పని మీద హాస్పిటల్‌కు వెళ్లిన ఫిలిప్ అక్కడ ఓ మ్యాగజైన్లో ఫొటో చూస్తాడు. అదే న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్. ఆ సమయంలో నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంటుంది. దొరికేసింది...తనకు సెట్ అయ్యే హైట్ దొరికింది అని ఎగిరి గంతేస్తాడు. వాటి మధ్య నడవాలని డిసైడైపోతాడు. మరి అతను ఆ ఫీట్ చేశాడా అన్నది మిగతా కథ. ఫిలిప్తోనే హీరోకి శిక్షణ ‘ఇన్సెప్షన్’, ‘లూపర్’, ‘డార్క్ నైట్ రైజస్’ లాంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించిన జోసఫ్ గోర్డన్ లెవిట్‌ను ఇందులో హీరోగా తీసుకున్నారు రాబర్ట్. మరి ఎంత గ్రాఫిక్స్‌లో చేసినా, హీరోకి తాడు మీద నడవడం వస్తే, సన్నివేశాలు నేచురల్‌గా వస్తాయని రాబర్ట్ ఆలోచన. ఏకంగా ఫిలిప్ పెటిట్‌ను రంగంలోకి దించి జోసఫ్‌కు ట్రైనింగ్ ఇప్పించారు. 8 రోజుల వర్క్ షాప్‌తో జోసఫ్ పర్ఫెక్ట్ అయ్యారు. గాంధీ పాత్ర పోషించిన బెన్ కింగ్స్లే ఈ చిత్రంలో ఫిలిప్‌కు ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా నటించారు. ప్రాక్టీస్ కోసం రియల్‌గానే... సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. షాట్ గ్యాప్‌లో కూడా జోసఫ్ కఠిన సాధన చేస్తున్నారు. సెప్టెంబరు 11 దాడుల్లో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా నిర్మించిన రెండు స్మారక స్తూపాల మధ్యలో నడవాలని అనుకున్నారు. అవి ఏకంగా 30 అడుగుల ఎత్తులో ఉంటాయి. ప్రాక్టీస్‌గా ఉంటుందని జోసఫ్ వాటి మధ్య నిజంగానే ఫీట్ చేశారు. పురుడు పోసుకున్న 1974 నాటి న్యూయార్క్ సెప్టెంబరు 11 దాడుల్లో కూలిన ట్విన్ టవర్స్ స్థానంలో ఇప్పుడు పెద్ద ఆకాశ హర్మ్యం ఉంది. పైగా 1974 నాటి న్యూయార్క్‌ను, ఆ ట్విన్ టవర్స్‌ను మళ్లీ రీక్రియేట్ చేయడం రాబర్ట్‌కు పెద్ద చాలెంజ్‌గా మారింది. ఫిలిప్ పాత్రతో ప్రేక్షకులు కూడా అంత హైట్‌లో ఆ కేబుల్ మీద ఉన్నామన్న ఫీలింగ్ కలిగించడానికి గ్రాఫిక్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫొటోల ఆధారంగా గ్రాఫిక్స్‌లో 1974 నాటి న్యూయార్క్‌కు పురుడు పోశారు. పైగా త్రీడీలో అయితే ప్రేక్షకులు మరింతగా కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో త్రీడీలో ఈ చిత్రాన్ని తీశారు. నాలుగు నెలల్లో ప్యాకప్ 2014 మే 26న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి, నాలుగు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రానికి మొత్తం 227 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మంచి వసూళ్ళు రాబడుతోంది. -
ఐమాక్స్ ప్రీమియార్ షో లో రౌడీ టీమ్ సందడి
-
ఎవడు చూసిన సాయి కుమార్