‘ప్రేమ కన్నా మోహం చాలా గొప్పది.. మోహం నుంచే ప్రేమ పుడుతుంది.. ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ మోహమే అని అనుకుంటారు.. రొమాంటిక్ సినిమాకు అదే ఫ్రెష్‌గా ఉంటుంది’అన్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’.పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటే చేసింది.
ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. . ‘ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా రోజులైంది. మూడేళ్ల తరువాత థియేటర్లో సినిమా చూడటం చాలా బాగుంది. సినిమా చూసిన చాలా మంది ఎమోషనల్ అయ్యారు. థియేటర్ కాకపోతే ఏడ్చేవాళ్లమని చాలా మంది చెప్పారు. ముందే ఎడిటింగ్ రూంలో చూసినప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చింది. ఇది ఇడియట్ లాంటి సినిమా అని అందరూ అన్నారు.
ఆకాశ్ మంచి నటుడే. కానీ రొమాన్స్‌లో వీక్. ఇంకా బాగా చేస్తాను అంటే ఇంకా బాగా రాస్తాను. ఈ చిత్రాన్ని యంగ్ జనరేషన్ తీస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే అనిల్‌కు ఇచ్చాను. కథను ఎంతో ప్రేమిస్తే గానీ కూడా అలాంటి ఎమోషన్‌ను క్యారీ చేసేలా తీయడం మామూలు విషయం కాదు. అనిల్ బాగా తీశాడు. దర్శకులందరూ వచ్చి ఈ చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇదొక మంచి వాతావరణాన్ని క్రియేట్ అయ్యేలా చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ కూడా సినిమా చూస్తే బాగుండేది. మళ్లీ నా మీద షాంపైన్ పోసేవారు. ఆయన ఏలూరులో షూటింగ్‌లో ఉన్నారు. అందుకే రాలేకపోయారు. నటుడిగా ఆకాశ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ఇది పెద్ద హీరో కథ. కానీ ఆకాశ్ బాగా హోల్డ్ చేశాడు. బయట సినిమాలు చేయనివ్వు.. కొంచెం పేరు వచ్చాక మనం చేద్దామని ఆకాశ్ అన్నాడు. సినిమా విడుదలవుతుందని తెలిసి.. ప్రభాస్ ఫోన్ చేశాడు. డార్లింగ్ మనం ఏం చేద్దాం.. ఎలా ప్రమోట్ చేద్దామని అన్నారు. ఇక విజయ్ కూడా వరంగల్‌లో ఫంక్షన్ పెడదామని అన్నారు. వారిద్దరూ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు’ అని అన్నారు.
‘ఆకాశ్ అద్భుతంగా నటించాడు. ఇది మా అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. ఇది మాకు చావో రేవో అనే సినిమా ఉండేది. కానీ నిన్న అందరూ సినిమా గురించి మాట్లాడాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్. సినిమాను ఇంతలా ప్రమోట్ చేసిన ప్రభాస్, విజయ్ దేవరకొండలకు థ్యాంక్స్’ అని అన్నారు నటి, నిర్మాత చార్మి.
చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా గుర్తుండిపోవాలని అనుకున్నాను. ఈ సినిమాకు నా వాయిస్ ప్లస్ అవుతుందని అందరూ అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. మీ నాన్న డబ్బింగ్ చెప్పారా? అని అన్నారు. సినిమా చూసిన అందరూ కూడా అదే అన్నారు. మా నాన్నకు ఓ హిట్ సినిమా ఇవ్వాలి. అదే నా లక్ష్యం. వాస్కోడిగామా పాత్రనే సెకండ్ పార్ట్‌గా తీయాలనే కోరికగా ఉంది’అన్నాడు యంగ్ హీరో ఆకాశ్.
Comments
Please login to add a commentAdd a comment