‘‘రొమాంటిక్’ చిత్రంలోని ‘పీనే కే బాద్..’ పాట చాలా పెద్ద హిట్ అయింది. చాలామంది రాత్రి పూట ఆ పాట పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు తెలిసినవాళ్లతో పాటు తెలియనివాళ్లు కూడా ఫోన్ చేసి, ‘పీనే కే బాద్..’ అని మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అన్నారు. ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు సునీల్ కశ్యప్ ఆ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
‘రొమాంటిక్’లో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది. పూరీగారు మామూలుగా ఎప్పుడూ ఎమోషనల్ అవ్వరు.. అలాంటిది ‘రొమాంటిక్’ చూశాక ఆయన కంట్లోంచి నీళ్లు రావడంతో నా పని మీద నాకు నమ్మకం వచ్చింది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎమోషన్ అవుతారు. మా ఇస్మార్ట్ గ్యాంగ్ సరదాగా చేసిన పాటే ‘పీనే కే బాద్..’. ఈ సినిమాలో కేతికా శర్మ పాడిన ‘నావల్ల కాదే..’ పాట కూడా పెద్ద హిట్ అయింది. ‘వాస్కోడిగామ..’ పాటలో ఆకాష్ వాయిస్ బాగుంది.
ప్రీ రిలీజ్‌లో ఆకాష్ మాట్లాడిన తీరులో తన కసి కనబడింది. హీరోలు ఎంత బాగా నటిస్తే నేను అంత బాగా రీ–రికార్డింగ్ (ఆర్‌ఆర్) ఇవ్వగలను. ‘రొమాంటిక్’ని అనిల్ బాగా తెరకెక్కించాడు. నటన పరంగా ఆకాష్‌ని మరో మెట్టు ఎక్కించే చిత్రమిది.
నా జర్నీలో ఎక్కువగా భాస్కరభట్లగారే ఉంటారు. పూరీగారు తన సినిమాలన్నీ నాకు ఇవ్వాలని ఏమీ లేదు.. ఇవ్వకపోయినా ఆయనతో ఉండటమే ఇష్టం. ఏం జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకు వెళుతుంటా. హిందీలోనూ రెండు సినిమాలు చేశాను.
భవిష్యత్తులో నా నుంచి క్లాసికల్ వేరియేషన్స్, క్లాసికల్ ఫ్యూజన్స్ రావచ్చు. ప్రతి సినిమాలో అలాంటివి చేయలేం.. కానీ, ప్రైవేట్ ఆల్బమ్‌లో అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం ‘గాడ్సే’ కి సంగీతం అందిస్తున్నాను. మరో రెండు సినిమాలు ఉన్నాయి.
చదవండి: ప్రభాస్ ఫోన్ చేసి.. సినిమాని ప్రమోట్ చేస్తానన్నాడు: పూరి
Comments
Please login to add a commentAdd a comment