Sunil Kashyap
-
విక్కీ ది రాక్‌స్టార్: హీరోహీరోయిన్ల లవ్ షేడ్ చూశారా?
విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన సినిమా విక్కీ ది రాక్ స్టార్. సిఎస్ గంటా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా బాధ్యతలు చేపట్టారు. భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిన్నారు. విక్కీ నుంచి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ షేడ్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు ప్రేమలోని మాధుర్యాన్ని చూపించేలా లవ్ షేడ్ గ్లింప్స్ విడుదల చేశారు. ‘ఎంత బాగుందో.. ఇలా నీ పక్కన ఉండటం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంది.. ఐ వాంట్ టు స్టే ఫరెవర్’ అంటూ సాగే ఈ లవ్ షేడ్‌లో ప్రేమకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. ఇందులో రొమాంటిక్ సీన్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సునీల్ కశ్యప్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. చదవండి: రణ్వీర్ నుంచి ఇలాంటివి ఆశించడంలో తప్పులేదు: నటి షాకింగ్ కామెంట్స్ హీరోయిన్‌పై ప్రభాస్ ఆసక్తికర పోస్ట్.. ‘నీ మ్యాజిక్ చూసేందుకు వెయిటింగ్’ -
ఆకాశ్‌లో ఆ కసి కనిపించింది: సంగీత దర్శకుడు సునీల్
‘‘రొమాంటిక్’ చిత్రంలోని ‘పీనే కే బాద్..’ పాట చాలా పెద్ద హిట్ అయింది. చాలామంది రాత్రి పూట ఆ పాట పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు తెలిసినవాళ్లతో పాటు తెలియనివాళ్లు కూడా ఫోన్ చేసి, ‘పీనే కే బాద్..’ అని మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అన్నారు. ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు సునీల్ కశ్యప్ ఆ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘రొమాంటిక్’లో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది. పూరీగారు మామూలుగా ఎప్పుడూ ఎమోషనల్ అవ్వరు.. అలాంటిది ‘రొమాంటిక్’ చూశాక ఆయన కంట్లోంచి నీళ్లు రావడంతో నా పని మీద నాకు నమ్మకం వచ్చింది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎమోషన్ అవుతారు. మా ఇస్మార్ట్ గ్యాంగ్ సరదాగా చేసిన పాటే ‘పీనే కే బాద్..’. ఈ సినిమాలో కేతికా శర్మ పాడిన ‘నావల్ల కాదే..’ పాట కూడా పెద్ద హిట్ అయింది. ‘వాస్కోడిగామ..’ పాటలో ఆకాష్ వాయిస్ బాగుంది. ప్రీ రిలీజ్లో ఆకాష్ మాట్లాడిన తీరులో తన కసి కనబడింది. హీరోలు ఎంత బాగా నటిస్తే నేను అంత బాగా రీ–రికార్డింగ్ (ఆర్ఆర్) ఇవ్వగలను. ‘రొమాంటిక్’ని అనిల్ బాగా తెరకెక్కించాడు. నటన పరంగా ఆకాష్‌ని మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. నా జర్నీలో ఎక్కువగా భాస్కరభట్లగారే ఉంటారు. పూరీగారు తన సినిమాలన్నీ నాకు ఇవ్వాలని ఏమీ లేదు.. ఇవ్వకపోయినా ఆయనతో ఉండటమే ఇష్టం. ఏం జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకు వెళుతుంటా. హిందీలోనూ రెండు సినిమాలు చేశాను. భవిష్యత్తులో నా నుంచి క్లాసికల్ వేరియేషన్స్, క్లాసికల్ ఫ్యూజన్స్ రావచ్చు. ప్రతి సినిమాలో అలాంటివి చేయలేం.. కానీ, ప్రైవేట్ ఆల్బమ్‌లో అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం ‘గాడ్సే’ కి సంగీతం అందిస్తున్నాను. మరో రెండు సినిమాలు ఉన్నాయి. చదవండి: ప్రభాస్ ఫోన్ చేసి.. సినిమాని ప్రమోట్ చేస్తానన్నాడు: పూరి -
‘నలుగురు అపరిచితులు.. గమ్యం ఒకటే’
సినిమా సినిమాకు డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు సుమంత్ అశ్విన్. ఫలితాలతో సంబంధం లేకుండా హార్రర్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ వంటి డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ నటుడిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథా చిత్రం-2 తర్వాత ఈ హీరో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం గురు పవన్ అనే దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. సుమంత్ అశ్విన్ సరసన ప్రియా వడ్లమాని కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో శ్రీకాంత్, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేశ్ నిర్మిస్తున్నారు . తాజాగా ఈ చిత్ర షూటింగ్ స్థానిక రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. త్వరలోనే చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం సుమంత్ అశ్విన్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నలుగురు అపరిచితులు.. 3450 కిలోమీటర్ల ప్రయాణం.. గమ్యం ఒకటే.. చివరికి ఏమైంది.. ఎందుకు ప్రయాణించారు’.. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: 50 శాతం పూర్తి.. వీసా కోసం వెయిటింగ్ 'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు' -
‘దెయ్యాలున్నాయని నిరూపిస్తే 5కోట్లు’
జబర్దస్త్ యాంకర్ రష్మీ హీరోయిన్గా సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. జబర్తస్త్‌లో ఫేమస్ కాకముందు నుంచే సిల్వర్ స్క్రిన్‌పై చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మి ‘గుంటూరు టాకీస్’ సినిమాలో నటించి మెప్పించారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపును తీసుకురాలేదు. అయితే మళ్లీ రష్మి హీరోయిన్గా ‘అంతకు మించి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు (జూలై 9) విడుదల చేశారు. దెయ్యాలున్నాయని నిరూపిస్తే ఐదు కోట్లు ఇస్తారన్న ప్రకటన చూసిన హీరో.. ఆ ప్రయత్నంలో ఉండగా హీరోయిన్‌తో పరిచయం.. నిజంగా దెయ్యాలున్నాయా? ఆ హీరోకు ఎదురైన పరిస్థితులు ఏంటి అన్న ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు జానీదర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. -
అమ్మ... మన మలుపు గెలుపు!
పాటతత్వం అమ్మ.. మన అడుగు అమ్మ.. మన వెలుగు అమ్మ.. మన మలుపు అమ్మ.. మన గెలుపు ఏమని చెప్పాలి... ఎంతని చెప్పాలి... అమ్మ గురించి చెప్పడానికి పదాలు చాలవు. ఈ సృష్టిలో అమ్మే లేకుంటే మనం లేము. అమ్మ గొప్పతనం వర్ణించడానికి ఎన్ని పాటలైనా సరిపోవు. గతంలో అమ్మపై చాలా పాటలొచ్చాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ‘లోఫర్’లో అమ్మపై ఓ పాట చేసే అవకాశం నాకు లభించింది. చిత్రంలో సందర్భం ఏంటంటే... ఊహ తెలియని వయసులోనే తల్లి నుంచి బిడ్డను దూరం చేసేస్తాడు ఓ తండ్రి. ఊహ వచ్చిన తర్వాత ‘నాన్నా.. అమ్మ ఏది?’ అని బిడ్డ అడిగిన ప్రతిసారీ మరణించిందని చెబుతాడు. అమ్మ బతికుందని తెలిసిన తర్వాత ఆ బిడ్డ మనసు పడే వేదనే ఈ పాట. సుద్దాల అశోక్ తేజగారు చాలా గొప్పగా రాశారు. జానపద శైలిలో పాటను స్వరపరచడం వలన ప్రేక్షకులకు సులభంగా చేరువైంది. పాట విన్న ప్రతిసారీ నా కళ్లు చెమర్చుతాయి. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎటువంటి సందర్భం ఎదురైనా... అమ్మ ఎంత ముఖ్యం అనేది పాటలో వివరించారు. సువ్వీ సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాటాడే ఈ బొమ్మ నా తలపై సెయ్యే పెట్టి.. నీ కడుపులో పేగును అడుగు మన ఇద్దరి నడుమున ముడి ఏందో.. అది గొంతెత్తి సెప్పుతాది వినుకోవే దునియాతో నాకేంటమ్మా.. నీతో ఉంటే చాలమ్మా... బ్రహ్మ గీసిన బొమ్మలే మనుషులంతా. ఆయనే మన తలరాత రాస్తాడని అంటుంటారు. కానీ, ఈ భూమ్మీద మనిషి బొమ్మను గీసేది మాత్రం అమ్మేనండీ. నవమాసాలూ మోసి జన్మనిచ్చిన తర్వాత ఓ వ్యక్తిగా, ఓ మనిషిగా మనల్ని తీర్చిదిద్దడంలో, అడుగులు వేయించడంలోనూ అమ్మ పాత్ర అనిర్వచనీయం. ప్రపంచంతో, పరిస్థితులతో పనిలేదు. అమ్మ ఉంటే చాలు. మంచి మనిషిగా ఎదుగుతాం. చిన్నారి బాధ ఏంటో? అమ్మ పేగుకి తెలుస్తుందంటారు కదా. దాన్ని, ‘నీతో ఉంటే చాలమ్మా..’ తర్వాత ‘ఎలో.. ఎలో.. నీ ఊగింది. ఒడి ఊయలలోనే’ అని సన్నివేశానికి అనుగుణంగా చెప్పారు. కాళ్ల మీద బజ్జొబెట్టి లాలపోసినావు ఏమో.. మళ్ళీ కాళ్ళు మొక్కుతాను గుర్తొకొస్తనేమో సూడు యెండి గిన్నెల్లో ఉగ్గుపాలు పోసి.. నింగి చందమామను నువ్వు పిల్వలేదా అవునో కాదంటే నువ్వు అడగవమ్మా.. మబ్బు సినుకై సెప్పుతాది యెన్నెలమ్మ దునియాతో నాకేంటమ్మా.. నీతో ఉంటే చాలమ్మా..! ఈ చరణంలో తనను గుర్తుపట్టని తల్లిని ‘లాలి’ ‘కాళ్ళు మొక్కుతాను’ ‘ఉగ్గుపాలు’ అని గుర్తుచేసే ప్రయత్నం చేస్తాడు హీరో. మనం ఒక్కసారి గమనిస్తే.. లాలిపోయడం దగ్గర్నుంచి బిడ్డ క్షేమం కోసం ఓ తల్లి ఎంత తపన పడుతుందండీ. ఉగ్గుపాలు పట్టించడంతో పాటు ఊహ తెలిసిన తర్వాత మంచీ చెడూ అన్నీ నేర్పే తొలి గురువు అమ్మే. బిడ్డ జీవితంలో వెలుగులు నింపుతుంది. తల్లి కోడిపిల్లనొచ్చి తన్నుకెల్లే గద్దలెక్క ఎత్తుకెల్లినోడు నన్ను పెంచలేదు మనిషిలెక్క సెడ్డదారుల్లో నేను ఎల్లినాక.. సెంపదెబ్బ కొట్టెసి మార్చే తల్లిలేక.. ఎట్టాపడితేను అట్టా బతికినానే.. ఇప్పుడు ఇట్టా వస్తే తలుపు మూయబోకే.. దునియాతో నాకేంటమ్మా.. నీతో ఉంటే చాలమ్మా..! ‘నాన్న నన్ను సరిగ్గా పెంచకపోవడంతోనే చెడ్డదారుల్లో ప్రయాణించాను. చెంపదెబ్బ కొట్టి నన్ను మార్చే తల్లి లేదు. ఎలా పడితే అలా బతికాను’ అంటూ ఆ కొడుకు ఆవేదన వ్యక్తం చేస్తాడు. బిడ్డ తప్పుడు దారిలో ప్రయాణిస్తే.. తల్లి మనసు విలవిల లాడుతుందనే కదా అర్థం. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలపై శ్రద్ధ పెట్టడం కొందరు తల్లిదండ్రులకు కుదరడం లేదు. అందువల్ల పిల్లలకు సరైన గెడైన్స్ దొరకడం లేదు. ఆ గెడైన్స్ ఉంటే చెడ్డదారుల్లో వెళ్లే పిల్లల జీవితాలు మంచి మలుపు తీసుకుంటాయి. మంచి మనిషిగా విజయం సాధిస్తారు. నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండే అద్భుతమైన పాట ఇది. ‘చాలా మంచి పాట చేశావ్ రా’ అని మా అమ్మానాన్నలు పాట విన్న ప్రతిసారీ చెప్తుంటారు. ప్రేక్షకులు, పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు. ఇటువంటి పాట చేసే సందర్భం కల్పించిన పూరిగారికి, పాట రాసిన సుద్దాల అశోక్ తేజగారికి హ్యాట్సాఫ్. సేకరణ: సత్య పులగం సుద్దాల అశోక్ తేజ, గీత రచయిత సునీల్ కశ్యప్, మ్యూజిక్ డెరైక్టర్ -
చూసినోడికి...కావాల్సినంత వినోదం
శివాజీ, నిత్య, లెజ్లీ త్రిపాఠీ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చూసినోడికి చూసినంత’. అనీల్ వాటుపల్లి దర్శకుడు. పి.శ్రీనివాసరావు నిర్మాత. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన నటి నిషా కొఠారీ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని మరో అతిథి కోన వెంకట్‌కి అందించారు. సినిమా పరిశ్రమను నిలబెడుతున్నది చిన్న చిత్రాలే అని, తాను చిన్న సినిమాల పక్షపాతిని అని ఈ సందర్భంగా కోన వెంకట్ పేరొన్నారు. ట్రైలర్స్ బాగున్నాయని, ఈ సినిమా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకు అన్నీ కుదిరాయి. చూసినవారికి కావాల్సినంత వినోదం పంచే సినిమా ఇది. పాటలు బాగా వచ్చాయి. తప్పకుండా అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు. దర్శకుడు అనిల్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనీ, మంచి పబ్లిసిటీతో జనాలకు సినిమాను చేరువ చేస్తే విజయం తథ్యమనీ శివాజీ పేర్కొన్నారు. అందరి సహకారం వల్లే సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగానని నిర్మాత చెప్పారు. -
‘చూసినోడికి చూసుకున్నంత’మూవీ స్టిల్స్
-
నవ్వుకునేవారికి నవ్వుకునేంత...
శివాజీ, నిత్య, లెజ్లీ, కృష్ణుడు, నాగబాబు ముఖ్య తారలుగా పీయస్ఆర్ నిర్మించిన చిత్రం ‘చూసినోడికి చూసుకున్నంత’. అనిల్ వాటుపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ పాటలు స్వరపరిచారు. ఈ వారంలో పాటలను, వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని, ప్రేక్షకులకు కావల్సినంత ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. నవ్వుకోగలిగినవారికి నవ్వుకున్నంత అనే తరహాలో ఈ సినిమా ఉంటుందని, శివాజీ అందించిన సహకారం కూడా మర్చిపోలేమని చెప్పారు.