Vikky The Rockstar: The Love Shade Glimpse Released, Check deets here - Sakshi
Sakshi News home page

Vikky The ROCKSTAR: ఇలా నీ పక్కన ఉండటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది

Published Wed, Jul 27 2022 5:59 PM | Last Updated on Wed, Jul 27 2022 6:30 PM

Vikky The Rockstar: The Love Shade Glimpse Released - Sakshi

విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన సినిమా విక్కీ ది రాక్‌ స్టార్‌. సిఎస్ గంటా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా బాధ్యతలు చేపట్టారు. భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిన్నారు.  

విక్కీ నుంచి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ షేడ్‌‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు ప్రేమలోని మాధుర్యాన్ని చూపించేలా లవ్ షేడ్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు. ‘ఎంత బాగుందో.. ఇలా నీ పక్కన ఉండటం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంది.. ఐ వాంట్ టు స్టే ఫరెవర్’ అంటూ సాగే ఈ లవ్ షేడ్‌లో ప్రేమకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. ఇందులో రొమాంటిక్ సీన్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సునీల్ కశ్యప్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

చదవండి: రణ్‌వీర్‌ నుంచి ఇలాంటివి ఆశించడంలో తప్పులేదు: నటి షాకింగ్‌ కామెంట్స్‌
హీరో​యిన్‌పై ప్రభాస్‌ ఆసక్తికర పోస్ట్‌.. ‘నీ మ్యాజిక్‌ చూసేందుకు వెయిటింగ్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement