
‘భరత్ అనే నేను’ లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత సూపర్‌స్టార్ మహేష్ నటిస్తోన్న చిత్రం మహర్షి. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో గడ్డంతో కనిపించని మహేష్.. ఈ మూవీ కోసం న్యూ లుక్‌ను ట్రై చేశాడు. మహేష్ కొత్త లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇటీవలె న్యూయార్క్ షెడ్యుల్‌ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విలేజ్ సెట్ వేసి ఓ 25రోజులు షూటింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. హిందీ డబ్బిండ్ రైట్స్‌ను దాదాపు 22కోట్లకు అమ్మినట్లు, అమెజాన్ ప్రైమ్ దాదాపు 12కోట్లకు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment