మహేష్‌ 25 టైటిల్‌ ఫిక్స్‌..? | 'Rajasam' Title For Mahesh Babu & Vamshi Paidipally Movie..? `- Sakshi
Sakshi News home page

Published Tue, May 29 2018 11:53 AM | Last Updated on Tue, May 28 2019 10:04 AM

Mahesh Babu And Vamshi Paidipally Movie Title Rajasam - Sakshi

భరత్‌ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సిద‍్ధమవుతున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇంకా షూటింగ్ ప్రారంభం కాని ఈ సినిమా టైటిల్‌ ఇదేనంటూ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ అవుతోంది.

మహేష్‌.. గడ్డం, మీసంతో సీరియస్‌ లుక్‌లో ఉన్న స్టిల్‌తో పాటు రాజసం అనే టైటిల్‌తో పోస్టర్‌ను డిజైన్‌ చేశారు. అశ్వనీదత్‌, దిల్‌ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్‌ జరుపుకోనున్న ఈ సినిమాలో కామెడీ స్టార్‌ అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌లో ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement