Vijay And Vamshi Paidipally Varasudu Movie Story Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Varasudu Movie: విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్‌!

Published Mon, Jan 9 2023 12:44 PM | Last Updated on Mon, Jan 9 2023 3:38 PM

Vijay, Vamshi Paidipally Varasudu Movie Story Goes Viral in Social Media - Sakshi

దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ వారసుడు. తమిళంలో వారిసు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లో సందడి చేయనుంది. మొదట జనవరి 11న రావాల్సిన ఈ చిత్రాన్ని జనవరి 14కు వాయిదా వేసినట్లు తాజాగా దిల్‌ రాజున ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ అనంతరం ఈ సినిమాపై పలువురు పాత కథ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందులో కొత్త పాయింట్‌ ఏం​ లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

చదవండి: 'వారసుడు' వాయిదా వేస్తున్నాం.. నేనే వెనక్కి తగ్గాను : దిల్‌రాజు

గతంలో వంశీ పైడిపల్లి తాను తీసిన బృందావనం చిత్రాన్నే అటూ ఇటూ మార్చి వారసుడు రూపొందించాడంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో వారసుడు మూవీ సంబంధించిన స్టోరీ లైన్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పలు తమిళ్‌ వెబ్‌సైట్లు ఈ మూవీ కథ ఇదేనంటూ కథనాలు రాసుకొస్తున్నాయి. ఈ తాజా బజ్‌ ప్రకారం.. వంశీ పైడిపల్లి కొత్త పాయింట్‌తో వారసుడు తెరకెక్కించాడు అంటున్నారు.

చదవండి: నేను అలా అనడం నచ్చలేదేమో: ఆ వివాదంపై రష్మిక స్పందన

 ‘వారసుడు మూవీ విజయ్ రాజేంద్రన్ అనే బడా వ్యాపారి చూట్టూ చూట్టూ తిరుగుతుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో విజయ్‌ తల్లిదండ్రులు శరత్‌ కుమార్‌, జయప్రద నటిస్తుండగా.. శ్రీకాంత్, శ్యామ్‌లు అన్న పాత్రలు పోషించారు. ఇందులో ప్రకాశ్‌ రాజ్‌ విజయ్‌కి వ్యతిరేకంగా ఉన్న కంపెనీ ఓనర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement