తమిళ స్టార్ హీరో విజయ్-టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషల్లో వచ్చిన రీసెంట్ మూవీ వారీసు(తెలుగు వారసుడు). సంక్రాంతి కానుక తమిళంలో జనవరి 11న, తెలుగు జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక్కడ దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 210 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.
చదవండి: SSMB28 సెట్‌లో క్రికెట్ ఆడిన తివిక్రమ్.. వీడియో వైరల్!
ఏ సినిమా అయిన బాక్సాఫీసు ఫలితాన్ని బట్టి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక స్టార్ హీరో సినిమాల గురించి చెప్పనవసరం లేదు. థియేట్రికల్ రిలీజ్ అనంతరం రెండు నెలల తర్వాత ఆ చిత్రం ఓటీటీలోకి వస్తుంది. కానీ అంతకుమందే విజయ్ వారసుడు ఓటీటీకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం వీడియోస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా భారీ ధరకు అమెజాన్ వారీసు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలస్తోంది.
చదవండి: అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్‌లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట!
విడుదలైన నెల రోజుల లోపే అంటే ఫిబ్రవరి 10న ఈ చిత్రం స్ట్రిమింగ్ కాబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజా బజ్ ప్రకారం వారసుడు ఫిబ్రవరి 22న అమెజాన్‌లో అందుబాటులోకి రానుందని సమాచారం. స్టార్ హీరో, పెద్ద బ్యానర్ సినిమా అయినందున వారసుడు చిత్రాన్ని నెల రోజుల తర్వాతే ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావాలని అమెజాన్ నిర్వహుకులు భావిస్తున్నారట. అందుకే ఫిబ్రవరి మూడో వారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనుందట. త్వరలోనే అమెజాన్ దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వునుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment