Story Line
-
విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్!
దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వారసుడు. తమిళంలో వారిసు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లో సందడి చేయనుంది. మొదట జనవరి 11న రావాల్సిన ఈ చిత్రాన్ని జనవరి 14కు వాయిదా వేసినట్లు తాజాగా దిల్ రాజున ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అనంతరం ఈ సినిమాపై పలువురు పాత కథ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొత్త పాయింట్ ఏం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చదవండి: 'వారసుడు' వాయిదా వేస్తున్నాం.. నేనే వెనక్కి తగ్గాను : దిల్‌రాజు గతంలో వంశీ పైడిపల్లి తాను తీసిన బృందావనం చిత్రాన్నే అటూ ఇటూ మార్చి వారసుడు రూపొందించాడంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో వారసుడు మూవీ సంబంధించిన స్టోరీ లైన్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పలు తమిళ్ వెబ్సైట్లు ఈ మూవీ కథ ఇదేనంటూ కథనాలు రాసుకొస్తున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. వంశీ పైడిపల్లి కొత్త పాయింట్‌తో వారసుడు తెరకెక్కించాడు అంటున్నారు. చదవండి: నేను అలా అనడం నచ్చలేదేమో: ఆ వివాదంపై రష్మిక స్పందన ‘వారసుడు మూవీ విజయ్ రాజేంద్రన్ అనే బడా వ్యాపారి చూట్టూ చూట్టూ తిరుగుతుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో విజయ్ తల్లిదండ్రులు శరత్ కుమార్, జయప్రద నటిస్తుండగా.. శ్రీకాంత్, శ్యామ్‌లు అన్న పాత్రలు పోషించారు. ఇందులో ప్రకాశ్ రాజ్ విజయ్‌కి వ్యతిరేకంగా ఉన్న కంపెనీ ఓనర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. -
సాహో నేపథ్యం అదే..!
బాహుబలి లాంటి భారీ విజయం తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. యువ దర్శకుడు సుజిత్ (రన్ రాజా రన్ ఫేం) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న సాహో లైన్ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రీవేంజ్ డ్రామా అని తెలుస్తోంది. అంతేకాదు సినిమాలో బలమైన సోషల్ మేసేజ్ కూడా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ధృవీకరించలేదు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్‌నితిన్ ముఖేష్, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఔను.. షారుక్ కోసం కథ అనుకున్నా!
పాత్ర డిమాండ్ చేస్తే విద్యాబాలన్ నీట్‌గానే కాదు.. డర్టీగా కూడా నటించగలరు. అందుకు ఉదాహరణ - పరిణీత, డర్టీ పిక్చర్ చిత్రాలు. ఆ విధంగా తనలో మంచి నటి ఉన్న విషయాన్ని నిరూపించుకున్న విద్యాబాలన్ ఇప్పుడు నిర్మాతగా, రచయిత్రిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. విద్యాబాలన్ భర్త సిద్ధార్ధ్ రాయ్ కపూర్ అగ్రనిర్మాత. అయినప్పటికీ తాను కూడా నిర్మాత అవ్వాలనుకుంటున్నారామె. తొలి ప్రయత్నంగా షారుక్ ఖాన్ హీరోగా ఓ చిత్రం నిర్మించాలనుకుంటున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్ అనుకున్నారు. ఆ కథను డెవలప్ చేయడానికి మరో రచయిత సహాయం తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే, గంటలు గంటలు కూర్చుని కథ రాసే ఓపిక విద్యాబాలన్‌కి లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే చెప్పారు. ఉద్వేగభరితమైన కథతో ఈ చిత్రం ఉంటుందనీ, సహజత్వానికి దగ్గరగా ఉంటుందనీ విద్యా పేర్కొన్నారు. అయితే, ఈ చిత్రం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు కాదు.. తర్వాత చెబుతా అని విద్యాబాలన్ అన్నారు.