ఔను.. షారుక్ కోసం కథ అనుకున్నా! | Want to write an interesting story for Shah Rukh Khan, says Vidya Balan | Sakshi
Sakshi News home page

ఔను.. షారుక్ కోసం కథ అనుకున్నా!

Published Sat, Jan 3 2015 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

ఔను.. షారుక్ కోసం కథ అనుకున్నా!

ఔను.. షారుక్ కోసం కథ అనుకున్నా!

 పాత్ర డిమాండ్ చేస్తే విద్యాబాలన్ నీట్‌గానే కాదు.. డర్టీగా కూడా నటించగలరు. అందుకు ఉదాహరణ - పరిణీత, డర్టీ పిక్చర్ చిత్రాలు. ఆ విధంగా తనలో మంచి నటి ఉన్న విషయాన్ని నిరూపించుకున్న విద్యాబాలన్ ఇప్పుడు నిర్మాతగా, రచయిత్రిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. విద్యాబాలన్ భర్త సిద్ధార్ధ్ రాయ్ కపూర్ అగ్రనిర్మాత. అయినప్పటికీ తాను కూడా నిర్మాత అవ్వాలనుకుంటున్నారామె.
 
  తొలి ప్రయత్నంగా షారుక్ ఖాన్ హీరోగా ఓ చిత్రం నిర్మించాలనుకుంటున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్ అనుకున్నారు. ఆ కథను డెవలప్ చేయడానికి మరో రచయిత సహాయం తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే, గంటలు గంటలు కూర్చుని కథ రాసే ఓపిక విద్యాబాలన్‌కి లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే చెప్పారు. ఉద్వేగభరితమైన కథతో ఈ చిత్రం ఉంటుందనీ, సహజత్వానికి దగ్గరగా ఉంటుందనీ విద్యా పేర్కొన్నారు. అయితే, ఈ చిత్రం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు కాదు.. తర్వాత చెబుతా అని విద్యాబాలన్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement