సాహో నేపథ్యం అదే..! | Prabhas Saaho Backdrop Revealed | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 23 2018 11:11 AM | Last Updated on Mon, Apr 23 2018 11:54 AM

Prabhas Saaho Backdrop Revealed - Sakshi

బాహుబలి లాంటి భారీ విజయం తరువాత రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. యువ దర్శకుడు సుజిత్‌ (రన్‌ రాజా రన్‌ ఫేం) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌ తో బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న సాహో లైన్‌ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రీవేంజ్‌ డ్రామా అని తెలుస్తోంది. అంతేకాదు సినిమాలో బలమైన సోషల్ మేసేజ్‌ కూడా ఉంటుందన్న ప‍్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ధృవీకరించలేదు. ప్రభాస్ సరసన బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు నీల్‌నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement