
సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభాస్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అనుష్కతో తన అనుబంధం గురించి క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. ఇక మీదట ఎట్టిపరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పేశాడు.
భారీ బడ్జెట్ చిత్రాల వల్ల చాలా రోజులు పాటు షూటింగ్ చేయాల్సి రావటంతో పాటు రిలీజ్ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురికావాల్సి వస్తుందన్నాడు ప్రభాస్. అభిమానుల కోరిక మేరకు ఇక మీదట ఏడాదికి రెండు సినిమాలు చేసేలా ప్రయత్నిస్తానని చెప్పాడు. అంతేకాదు ‘సాహో భారీ వసూళ్లు సాధించి చరిత్ర సృష్టిస్తుందో లేదో చెప్పలేను కానీ బాహుబలి అభిమానులను మాత్రం తప్పకుండా అలరిస్తుంద’న్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. శ్రద్ధకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment