Thalapathy Vijay Attends Varasudu Success Party at Dil Raju Home - Sakshi
Sakshi News home page

Vijay: దిల్‌ రాజు ఇంట్లో వారసుడు సక్సెస్‌ పార్టీ.. ఫోటోలు వైరల్‌

Published Sun, Jan 22 2023 3:23 PM | Last Updated on Sun, Jan 22 2023 3:45 PM

Vijay Attends Varasudu Success Party At Dil Raju Home - Sakshi

దళపతి విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం వారసుడు(వారిసు). రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు తన ఇంట్లోనే సక్సెస్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ కోసం విజయ్‌ చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చాడు.

శనివారం రాత్రి జరిగిన ఈ పార్టీలో వారసుడు టీమ్‌లోని ముఖ్యులంతా సందడి చేశారు. అయితే రష్మిక మాత్రం ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. ఇక దిల్‌ రాజు మనవరాలు ఇషిత రంజితమే పాటకు స్టెప్పులేయడంతో మురిసిపోయిన విజయ్‌ ఆమెను ఎత్తుకుని అభినందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

చదవండి: కొత్త బిజినెస్‌ మొదలుపెట్టిన మంచు విరానిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement