
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్ 25వ చిత్రం కూడా కావటంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2019 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నాట్టుగా ప్రకటించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం మహర్షి విడుదల మరింత ఆలస్యం కానుందట. ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 5న కాకుండా ఏప్రిల్ 26న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ ఈ సినిమాప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో మేకింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే రిలీజ్ ఆలస్యమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment