
యాక్షనా? ఫ్యాక్షనా? ఫ్యామిలీయా?... ఏంటి? మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న స్టోరీ బ్యాక్‌డ్రాప్ ఏంటి? అనే చర్చలు మొదలయ్యాయి. అప్పుడే చెప్పేస్తామా? టూ ఎర్లీ అమ్మా అన్నట్లు చిత్రబృందం సైలెంట్‌గా ఉంటోంది. అయితే, మ్యూజిక్ సిట్టింగ్స్ మాత్రం జరుగుతున్నాయి. ఆ విషయం మాత్రం చెప్పారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. న్యూయార్క్‌లో వంశీ పైడిపల్లి–దేవిశ్రీ–చిత్రనిర్మాత ‘దిల్’ రాజు పాటల పని మీద ఉన్న విషయం తెలిసిందే.
ఆల్రెడీ మూడు పాటలకు ట్యూన్స్ ఫైనలైజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్‌కి స్టోరీ తెలుస్తుంది కదా. అందుకే ‘అమేజింగ్ అండ్ ఇన్‌స్పైరింగ్ స్క్రిప్ట్. అందరికీ నచ్చేలా ఉంది’ అని హింట్ ఇచ్చారు దేవిశ్రీ. జనవరిలో ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది. కాగా, ఈ చిత్రానికి ‘హరేరామ హరేకృష’్ణ, ‘కృష్ణాముకుందా మురారి’ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయనే వార్త వచ్చింది. ఆ వార్త నిజం కాదని వంశీ పైడిపల్లి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment