
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్ 25వ సినిమా కూడా కావటంతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అందుకు తగ్గట్టుగా దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఉగాది సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు.
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్ యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తూ టాలీవుడ్‌లో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. విడుదలైన 12 గంటల లోపే 10 మిలయన్ల(కోటి)కు పైగా వ్యూస్ సాధించి ఆల్‌టైం రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ టీజర్ 12.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.
స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో యంగ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
12.6 Million Real Time Views in 24 hours🔥🔥
— Sri Venkateswara Creations (@SVC_official) 7 April 2019
RISHI is on RAMPAGE🤘#JoinRishi... https://t.co/y0HGn7FQFb#TrendsettingMaharshiTeaser#Maharshi #SSMB25 @urstrulyMahesh @directorvamshi @hegdepooja @allarinaresh @ThisIsDSP @kumohanan1 pic.twitter.com/XA1ijMWY1S
Comments
Please login to add a commentAdd a comment