
మహేశ్‌బాబు
డెహ్రాడూన్‌లో తన ప్రయాణాన్ని మొదలెట్టారు రిషి. తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత గోవా వెళ్లారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నారు. మరి.. నెక్ట్స్ ఎటు? అంటే అమెరికానే అట. తన 25వ చిత్రం ‘మహర్షి’ కోసం మహేశ్‌బాబు రిషిగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రయాణం గురించే మేం చెబుతున్నది. మహేశ్‌బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మహర్షి’. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమా షూటింVŠ ఈరోజుతో హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తి కానుంది. ఆ తర్వాతి షెడ్యూల్‌ని కూడా హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారు వంశీ. వచ్చే వారం స్టార్ట్ కానున్న ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత అమెరికా ప్రయాణం అవ్వనున్నారు చిత్రబృందం. అక్కడ దాదాపు రెండు నెలలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌బాబు తల్లిగా సీనియర్ నటి జయప్రద కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: కేయు మోహనన్.
Comments
Please login to add a commentAdd a comment