శ్రుతీహాసన్
చిన్న బ్రేక్ తర్వాత వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు శ్రుతీహాసన్. రవితేజతో ‘క్రాక్’ సినిమా చేస్తున్నారామె. ఇపుడు మరో పెద్ద సినిమాలో కూడా కనిపించబోతున్నారని సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతీహాసన్ పేరుని పరిశీలిస్తున్నారట దర్శకుడు వంశీ పైడిపల్లి. గతంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ జోడీగా నటించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘ఎవడు’ సినిమాలోనూ శ్రుతీహాసనే హీరోయిన్. వచ్చే ఏడాది వేసవి తర్వాత సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో మహేశ్, శ్రుతీ రెండోసారి జోడీ కడతారా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment