అబుదాబీ ఫ్లైట్‌ ఎక్కనున్న ‘మహర్షి’ టీమ్‌..!! | maharshi movie released on maha shivaratri | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 20 2019 2:23 AM | Last Updated on Sun, Apr 7 2019 12:28 PM

maharshi movie released on maha shivaratri - Sakshi

మహేశ్‌బాబు

మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఫిబ్రవరి ఫస్ట్‌ వీక్‌లో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారట చిత్రబృందం. ఆ తర్వాత కొన్ని కీలక సన్నివేశాల కోసం అబుదాబీ ఫ్లైట్‌ ఎక్కుతారట ‘మహర్షి’  టీమ్‌. అంతటితో ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుందని సమాచారం. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని టాక్‌. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర చేస్తున్నారు.

‘దిల్‌’ రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఏప్రిల్‌ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ, ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ఎఫ్‌ 2’ తో సూపర్‌ సక్సెస్‌ను అందుకున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. మహేశ్‌కు అనిల్‌ ఓ స్టోరీ లైన్‌ను చెప్పగా ఇంప్రెస్‌ అయిన మహేశ్‌ స్క్రిప్ట్‌ను డెవలప్‌ చేయమని చెప్పారని ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. ‘మహర్షి’ సినిమా తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement