
వంశీ పైడిపల్లి, రామ్‌చరణ్
‘ఎవడు’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరో రామ్‌చరణ్. ఈ కాంబినేషన్ మళ్లీ కలవనుందని ఈ మధ్య తరచుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా పక్కా అనేది తాజా సమాచారం. ఇటీవలే కథా చర్చలు కూడా పూర్తయ్యాయని టాక్. దసరా తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’, చిరంజీవి ‘ఆచార్య’లో అతిథి పాత్ర చేస్తున్నారు రామ్‌చరణ్. ఈ సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యాక వంశీ పైడిపల్లి సినిమా చిత్రీకరణ మొదలుపెడతారు చరణ్. ఇదో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని టాక్.
Comments
Please login to add a commentAdd a comment