
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి టీజర్‌ను కాసేపటి క్రితం రిలీజ్ చేశారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా డబుల్ ట్రీట్ అందిస్తామని ఇది వరకే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత రాత్రి టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు టీజర్‌ను వదిలారు.
మీట్ రిషి అన్న కాప్షన్‌తో.. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్న మహేష్.. అమ్మాయిలును ఓరకంటగా చూస్తూ వెళ్తున్న టీజర్ ఆకట్టుకునేలా ఉంది. దేవీ మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెసివ్‌గా ఉంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment