
అల్లిపురం (విశాఖ దక్షిణం): వైజాగ్ మా సెంటిమెంట్ అని వారసుడు చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. వైజాగ్ వచ్చినప్పుడల్లా నగరంలో సంపత్ వినాయగర్ ఆలయం, సింహాచలం సింహాద్రి అప్పన్న గుడికి వెళ్లడం ఆనవాయితీ అన్నారు. తన సినిమాలన్నీ విశాఖలోనే షూటింగ్‌లు జరుపుకున్నాయన్నారు. భారత్ సూపర్ స్టార్ విజయ్ ఇటువంటి కథ ఒప్పుకోగానే తనకు భయమేసిం దన్నారు. వారసుడు చిత్ర యూనిట్ నగరంలోని మెలోడి థియేటర్‌లో శుక్రవారం సాయంత్రం సందడి చేసింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ వారసుడు తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కావడం గర్వంగా ఉందన్నారు. తమన్ సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచిందన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ బృందావనం తరువాత దర్శకుడు వంశీతో మళ్లీ పని చేశానన్నారు. దిల్‌రాజు ఉత్తమ నిర్మాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నటి సంగీత, డి్రస్టిబ్యూటర్ ప్రతినిధి దిల్ శ్రీనివాస్, థియేటర్ మేనేజర్లు గౌరీ శంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment