vizag town
-
నటుడు సుధీర్ ఆత్మహత్యకు గల కారణాలు ఇవేనా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్యతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ‘సెకండ్ హ్యండ్’, ‘కుందనపు బొమ్మ వంటి’, ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ వంటి పలు సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ సూసైడ్‌కు కారణాలు ఏంటన్నది పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈనెల18న సుధీర్ వర్మ పాయిజన్ తీసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని గుర్తించిన స్నేహితుడు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సుధీర్‌ను విశాఖలోని ఎల్. జీ. ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించి సుధీర్ మరణించాడు. పోస్టుమార్టం రిపోర్డులోనూ విషం తీసుకోవడం వల్ల మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. హీరోగా ఎంతో భవిష్యత్తు ఉన్న సుధీర్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నది విచారించగా.. అతడి స్నేహితుడు మాట్లాడుతూ.. సుధీర్ చాలా మంచి వ్యక్తి అని, అయితే చాలా సున్నిత మనస్కుడని తెలిపాడు. తండ్రి మరణం తర్వాత తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్నాళ్లుగా సుధీర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆ కారణంగానే సుధీర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంత చిన్న వయసులో సుధీర్ బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచి వేస్తోంది. -
తీవ్ర విషాదం.. టాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌లోని నివాసంలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. దర్శకుడు రాఘవేందర్ రావు సమర్పణలో వచ్చిన కుందనపు బొమ్మ చిత్రంలో హీరోగా సుధీర్ వర్మ నటించారు. సెకండ్ హ్యాండ్, షూట్ఔట్ ఎట్ ఆలేరు చిత్రాల్లోనూ కనిపించారు. పలు వెబ్ సిరీస్‌ల్లోనూ సుధీర్ నటించారు. నటుడి మృతిపట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సుధీర్ మృతి చెందిన విషయాన్ని ‘కుందనపు బొమ్మ’ సినిమాలో నటించిన సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సుధీర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుధీర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని సుధాకర్ పేర్కొన్నారు. Sudheer! @sudheervarmak Such a lovely and warm guy’ It was great knowing you and working with you brother! Can’t digest the fact that you are no more! Om Shanti!🙏🙏🙏 @iChandiniC @vara_mullapudi @anil_anilbhanu pic.twitter.com/Sw7KdTRkpG — Sudhakar Komakula (@UrsSudhakarK) January 23, 2023 -
వైజాగ్ మా సెంటిమెంట్ : వంశీ పైడిపల్లి
అల్లిపురం (విశాఖ దక్షిణం): వైజాగ్ మా సెంటిమెంట్ అని వారసుడు చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. వైజాగ్ వచ్చినప్పుడల్లా నగరంలో సంపత్ వినాయగర్ ఆలయం, సింహాచలం సింహాద్రి అప్పన్న గుడికి వెళ్లడం ఆనవాయితీ అన్నారు. తన సినిమాలన్నీ విశాఖలోనే షూటింగ్‌లు జరుపుకున్నాయన్నారు. భారత్ సూపర్ స్టార్ విజయ్ ఇటువంటి కథ ఒప్పుకోగానే తనకు భయమేసిం దన్నారు. వారసుడు చిత్ర యూనిట్ నగరంలోని మెలోడి థియేటర్లో శుక్రవారం సాయంత్రం సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ వారసుడు తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కావడం గర్వంగా ఉందన్నారు. తమన్ సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచిందన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ బృందావనం తరువాత దర్శకుడు వంశీతో మళ్లీ పని చేశానన్నారు. దిల్‌రాజు ఉత్తమ నిర్మాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నటి సంగీత, డి్రస్టిబ్యూటర్ ప్రతినిధి దిల్ శ్రీనివాస్, థియేటర్ మేనేజర్లు గౌరీ శంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
స్తంభించిన జనజీవనం
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు జేఏసీలు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం విశాఖ నగరంలోనూ, జిల్లాలోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది. జనజీవనం స్తంభించింది. వ్యాపారులు స్వచ్ఛ ందంగా బంద్ పాటించారు. రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణంతో కనిపించారుు. నిత్యం రద్దీగా జంక్షన్లన్నీ జనం లేక బోసిపోయాయి. అన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారారుు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టడంతో దాదాపు 45 రోజులుగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆటో యూనియన్లన్నీ బంద్ పాటిం చారుు. ఎక్కడికక్కడ ఆటో కార్మికులు ఆటోలను నిలుపుతూ కనిపించారు. పలుచోట్ల సమైక్యవాదులు మానవహారాలు, రాస్తారోకో లు చేపట్టారు. వస్త్ర దుకాణాలు, హోటల్స్ మూత పడ్డారుు. మార్నింగ్, మ్యాట్నీషోలు రద్దు చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, యలమం చిలి,పాయకరావుపేట, చోడవరం, ఏజెన్సీలో ని పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో బంద్ ప్రభావం బాగా కనిపిం చింది. ఆయా చోట్ల బ్యాంకులు, పెట్రోల్ బంకులు తెరచుకోలేదు. అరకులోయలో రాకపోకలు సాగించడానికి వీల్లేకుండా రోడ్లపై చెట్లు నరికి, వాహనాలను అడ్డంగా ఉంచారు.