
ఈ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసిపోతున్నారు. ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేయటంలో పాటు ప్రైవేట్ పార్టీలలోనూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు తరుచూ పార్టీల్లో పాల్గొంటు అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా మహేష్, తారక్ లు పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి తన భార్య మాలిని పుట్టిన రోజు సందర్భంగా ట్రీట్ ఇచ్చాడు. ఈ పార్టీకి మహేష్, తారక్ లు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈసందర్భంగా అంతా కలిసి తీసుకున్న సెల్పీని నమ్రత తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మహర్షి సినమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment