
మహేశ్‌బాబు
మహేశ్‌బాబు దాదాపు క్లీన్ షేవ్‌లో ఉంటారు. లేటెస్ట్ సినిమా కోసం గడ్డం పెంచి అందర్నీ ఆశ్చర్యపరిచారాయన. అయితే ఈ లుక్ సినిమా మొత్తం కాదు. కేవలం కొంత పోర్షన్ వరకే. సినిమాలో కనిపించే కాలేజ్ ఎపిసోడ్స్ వరకు మహేశ్‌బాబు పొడువైన జుత్తు, గడ్డం, మీసాల్లో కనిపిస్తారట. ఆ కాలేజ్ సీన్స్ కంప్లీట్ అవడంతో గడ్డాన్ని ట్రిమ్ చేసి మళ్లీ తన లుక్‌లోకి వచ్చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ‘అల్లరి’ నరేశ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
‘దిల్’రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను డెహ్రాడూన్‌లో 24రోజులు షూట్ చేశారు చిత్రబృందం. ఈ షెడ్యూల్‌లోనే కాలేజ్ ఎపిసోడ్ అంతా కంప్లీట్ చేశారు. ఇందులో మహేశ్, ‘అల్లరి’ నరేశ్ స్టూడెంట్స్‌గా రైతు సమస్యల మీద రీసెర్చ్ చేస్తారనీ, ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్ర కథ ఉండబోతోందనీ సమాచారం. నెక్ట్స్ షెడ్యూల్ యూఎస్‌లో ఈ నెల మూడో వారం నుంచి స్టార్ట్ కానుంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన నాలుగు ట్యూన్స్‌ను కంపోజ్ చేశారట దేవీశ్రీ ప్రసాద్. మహేశ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్ట్ 9న విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఉగాది సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment